NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

సోము… ఎందుకీ కాము!! కమలం పార్టీ వింత ధోరణి

 

 

విజయనగరం జిల్లా రామతీర్థం రామాలయాన్ని దక్షిణ అయోధ్యగా పిలుచుకుంటారు… ఈ ఆలయ ప్రాశస్త్యం కూడా ఎంతో పెద్దది.. ఏటా శ్రీరామనవమి వేడుకలు ఎంతో ఘనంగా జరపడంతో పాటు… వేట ఆలయ వార్షికోత్సవాలను శ్రీ రామ తీర్థం పేరిట వేడుకగా జాతరగా నిర్వహిస్తారు. విజయనగరం జిల్లా శ్రీకాకుళం సరిహద్దులో ఉన్న ఈ రామతీర్థం ఆలయం ఇటు రెండు జిల్లాలకు ఎంతో ప్రసిద్ధి…. అలాంటి కీలకమైన ఆలయంలోని శ్రీరాముడి విగ్రహాన్ని తల నరికి కొంతమంది దుండగులు పడేయడం… చాలా పెద్ద విషయం. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయ రథం తగలబడి పోయినప్పుడు ఎంతో హడావుడి చేసిన బిజెపి శ్రీ రామ తీర్థం విషయంలో మాత్రం వినకొండ ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది… ఇదే పరిస్థితి తెలంగాణలో జరిగితే అక్కడ ఉండే నేతలు ముఖ్యంగా బిజెపి నేతలు… బండి సంజయ్ రాజా సింగ్ లాంటి నేతలు స్పందన వేరుగా ఉండేది.. వారు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి వెంటనే దాన్ని తమ పార్టీకి అనుబంధంగా, తమ పార్టీకి సిమెంటు వచ్చేలా నిరసనలు చేపట్టేవారు.. మరి ఆంధ్ర బీజేపీ నేతలు మాత్రం దీనికి భిన్నం… అసలు దేనికి స్పందించాలో దేనికి సైలెంట్ ఉండాలో తెలియని అయోమయ పరిస్థితి వారిది.. హిందుత్వమే ప్రధాన అజెండాగా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పక్షం పాత్ర వహించాలని కోరుతున్న బిజెపి ఇలాంటి కీలకమైన సమయాలను అందిపుచ్చుకుని హిందూత్వ ప్రధాన ఎజెండాగా రాష్ట్రంలో ముందుకు సాగడానికి నేతల తీరే కారణం..

 

సోము ఏమిటిది??

ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించిన దగ్గర్నుంచి ఏపీ బీజేపీ లో కొన్ని కీలక మార్పులు వచ్చాయి… గతంలో పోలిస్తే కాస్త స్పీడ్ పెరిగినట్లు కనిపిస్తున్న ఈ స్పీడు పార్టీ పుంజుకోవడానికి ఏమాత్రం సరిపోదు. ముఖ్యంగా హిందుత్వ ఎజెండాతో ముందుకు సాగే బిజెపి ఆలయాల ముఖ్యంగా ప్రధాన ఆలయాల విషయంలో జరుగుతున్న దాడుల విషయంలో స్పందిస్తుంది శున్యం. కేవలం సోము వీర్రాజు తప్ప మిగిలిన ఫైర్ బ్రాండ్ నాయకులెవరూ కనిపించకపోవడం హిందూత్వ ఎజెండా ధాటిగా ఎదుటి పక్షం పై దాడులు చేసే నేతలు ఆంధ్ర బిజెపికి లేకపోవడం పెద్ద మైనస్… ఇటీవల బీజేపీ లోకి వచ్చిన ఆంధ్ర నేతలంతా కేవలం తమ ప్రాపకం కోసం తమ వ్యాపారాలు కోసం వచ్చిన వారే తప్ప పార్టీకి పెద్దగా ఉపయోగం ఉన్న వారు లేరు. దీంతో ప్రతి విషయాన్ని సోము వీర్రాజు సింగిల్ మెన్ ఆర్మీ గా డీల్ చేస్తున్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ బిజెపి ఇతర నేతల నుంచి మద్దతు పూర్తిగా సున్నా.


** బుధవారం సైతం సోము వీర్రాజు ప్రెస్ మీట్ పెట్టి వివిధ అంశాలపైన స్పందించిన.. మధ్యలో ఆలయాల దాడులు రామతీర్థం ఆలయం పై స్పందించిన అది పెద్దగా మీడియాలో రాలేదు. అయితే ఆయన కేవలం స్పందించడం మాత్రమే కాకుండా ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లి… ఆలయం దగ్గరే మీడియాతో మాట్లాడి విషయాన్ని పెద్దది చేసి ఉంటే బిజెపికి ఇది ప్లస్ అయ్యేది.. బిజెపి లోని ఇతర నేతలు సైతం దీన్ని పెద్ద సీరియస్ అంశంగా పరిగణించిన ట్లు లేరు…

author avatar
Comrade CHE

Related posts

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju