NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Mansas Trust: టార్గెట్ అశోక్ గజపతిరాజు.. ఒకే రోజు రెండు కీలక పరిణామాలు..

Mansas Trust: మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ బాధ్యతలు నిర్వహిస్తున్న టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును జైలుకు పంపి తీరతామని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇంతకు ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాలతో అశోక్ గజపతిరాజు తిరిగి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మాన్సాస్, సింహాచలం ఆలయ భూముల్లో జరిగిన భూ అక్రమాలను వెలికి తీసి ఆయనను అరెస్టు చేయడం ఖాయమంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

Vigilance enquiry on Mansas Trust lands
Vigilance enquiry on Mansas Trust lands

Read More: Pegasus: పెగసెస్ పై కేంద్రం కీలక ప్రకటన..!!

ఈ క్రమంలో ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ సింహచలం దేవస్థానంలో ప్రాపర్టీ రిజిస్టార్ లో భారీగా భూములు తొలగించినట్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం భూముల వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణకు ఏపి ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు నోడల్ అఫీసర్ గా దేవాదాయ శాఖ కమిషనర్ ను నియమించింది. మాజీ ఇఓ రామచంద్రన్ హయాంలో అక్రమాలపై విచారణకు ఆదేశించారు. మూడు నెలల్లో నివేదక సమర్పించాలని ఏపి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మాన్సాస్ ట్రస్ట్ భూముల విక్రయాల్లో అక్రమాలు, తదితర ద్వారా రూ.74.72 కోట్ల మేర నష్టం కల్గించారని పేర్కొంటూ గతంలో దేవస్థానం ఇఓగా పని చేసిన రామచంద్రమోహన్ పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు విధించిన విషయం తెలిసిందే. అధికారుల కమటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్న ప్రభుత్వం దీనిపై మరింత లోతుగా దర్యాప్తునకు విజిలెన్స్ విచారణ చేపడుతున్నట్లు తాజాగా వెల్లడించింది.

మరో పక్క మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా తనను నియమించేలా అదేశాలు ఇవ్వాలంటూ ఊర్మిల గజపతిరాజు ఏపి హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా ఊర్మిల తరపున న్యాయవాది మాట్లాడుతూ ఆనంద గజపతిరాజు మొదటి భార్య కుమార్తె సంచయిత, రెండో భార్య కుమార్తె ఊర్మిలను ప్రభుత్వం వారసులుగా గుర్తించిందని కోర్టుకు తెలిపారు. కావున అశోక్ గజపతిరాజును చైర్మన్ గా తొలగించి ఆ స్థానంలో  ఊర్మిళ గజపతిరాజును చైర్మన్ గా నియమించాలని న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను మంగళవారంకు వాయిదా వేసింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N