Vijaya Sai Reddy: చంద్రబాబుపై మరో కేసు పెడతారా? విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్..!!

Share

Vijaya Sai Reddy: కరోనా వేళ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. ఓ పక్క కరోనా రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సమీక్షా సమావేశాలను నిర్వహిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు. కరోనా రోగులకు ఉచితంగా వైద్యసేవలు అందించాలనీ, ప్రైవేటు ఆసుపత్రిల్లో ఆరోగ్య శ్రీ పథకం ద్వారా చేర్చుకుని ఉచిత వైద్యసేవలు అందించాలని ఆదేశాలు ఇస్తూనే ఉంది. మరో పక్క ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి అధిక పీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై తనిఖీలు నిర్వహిస్తూ విజిలెన్స్ అధికారులు అక్రమాలపై క్రిమినల్ కేసులను నమోదు చేస్తోంది. నిన్ననే కడప, చిత్తూరు జిల్లాలో ఇద్దరు డాక్టర్ లను కూడా అరెస్టు చేశారు. కోవిడ్ రోగులకు సరైన వైద్యం అందడం లేదంటూ టీడీపీ నేతలు పదే పదే విమర్శలు చేస్తున్నారు. అదే విధంగా కరోనా కేసులు పెరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తుందంటూ కూడా విమర్శలు చేస్తున్నది. వీటిపై వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Vijaya Sai Reddy tweets against chandrababu
Vijaya Sai Reddy tweets against chandrababu

బాబు మీడియా సమావేశం చూస్తే అసలు బాధ వైజాగ్ లో పల్లా అక్రమ నిర్మాణం కూల్చివేత, సంగం డెయిరీలో వందల కోట్లు మేసి పాడి రైతుల రక్తం పీల్చిన ధూళిపాళ్ల అరెస్టుపైన ఏడవడానికే అని తెలిసిపోతుందని విజయసాయి రెడ్డి విమర్శించారు. కరోనా టైంలో దొంగలు దొరికినా వదిలిపెట్టాలంట. పత్తిగింజ నీతి చంద్రిక బోధిస్తోంది అంటూ ఎద్దేవా చేశారు. కరోనా విలయంపై కేంద్రాన్ని, విఫలమైన పెద్ద రాష్ట్రాలను విమర్శించే దమ్ములేక చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటున్నారని అన్నారు. టెస్టులు, వ్యాక్సినేషన్, రికవరీ రేటు, ఆక్సిజన్ నిల్వలు, బెడ్లు పెంచడంలో అగ్రస్థానంలో ఏపి ఉందన్న విషయం తెలిసికూడా పనికిరాడని అందరూ తేల్చిన కొడుకు కోసం అయినా తిట్టాలని విమర్శిస్తున్నారని అన్నారు.

Vijaya Sai Reddy: చంద్రబాబుపైనే మొదట కేసు పెట్టాలి

ఏపీ ప్రజలను ఇతర రాష్ట్రాలు అనుమతించడం లేదని 40 ఇయర్స్ ఇండస్ట్రీ నిస్సిగ్గుగా మాట్లాడారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు జరగడం లేదనేది పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని అన్నారు. కరోనాపై ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారిపై క్రిమినల్ కేసులు పెట్టడం మొదలు పెడితే ఫస్ట్ చంద్రబాబునే బుక్ చేయాల్సి ఉంటుందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. కరోనా విషయంలో అసత్య కథనాలు, అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే కేసులు పెట్టి జైలుకు పంపే అధికారం ఉందన్న విషయం అధికారులు గుర్తుంచుకోవాలని ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. దీన్ని గుర్తు పెట్టుకుని చంద్రబాబుపై కేసు నమోదు చేయాల్సి ఉంటుందని విజయసాయిరెడ్డి అన్నట్లు ఉన్నారు.

అదే విధంగా చంద్రబాబుకు మతిమరుపు వ్యాధి ముదిరిందని తానే బయట పెట్టుకున్నారని సెటైర్ వేశారు. మద్రాసు హైకోర్టు ఈసీపైన చేసిన వ్యాఖ్యలు నిమ్మగడ్డకు, తనకు వర్తిస్తాయని మర్చి పోవడం వ్యాధి తీవ్రత పెరిగిన దానికి సంకేతమన్నారు. ప్రభుత్వం వద్దంటే ఎన్నికలకు కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నదెవరు ? మరి ఉరి తీయాల్సిందెవరిని బాబూ అని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి.


Share

Related posts

అందరూ హీరోయిన్స్ హన్సిక హ్యాండ్ బ్యాగ్ గురించే మాట్లాడుతున్నారు .. అసలేముంది దాంట్లో..?

GRK

మోడీ మెడలు వంచడానికి కే‌సి‌ఆర్ కి పెద్ద అస్త్రం దొరికింది !

sridhar

Jeff bezos: జెఫ్ బెజోన్‌తో అంతరిక్ష యాత్ర చేసిన కుర్రాడు ఓలీవర్ డేమన్ చెప్పిన షాకింగ్ న్యూస్ ఇదీ..

bharani jella