NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

దుర్గగుడి వెండి విగ్రహాల చోరీ కేసులో నిందితులు అరెస్టు.. !!

విజయవాడ కనకదుర్గగుడిలో అమ్మవారి వెండి రథానికి చెందిన మూడు వెండి సింహాల ప్రతిమల అపహరణ కేసులో దొంగను ఎట్టకేలకు విజయవాడ వెస్ట్ జోన్ పోలీసులు పట్టుకున్నారు. నాలుగు నెలలుగా కేసు దర్యాప్తు జరుగుతుండగా మిస్టరీని ఛేదించారు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో వెండి సింహాల విగ్రహాలు చోరీ అయినట్లు అధికారులు గుర్తించారు. సెప్టెంబర్ 17న ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసు శాఖ మూడు బృందాలను రంగంలోకి దింపింది. శనివారం విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు వివరాలను మీడియాకు వెల్లడించారు.

vijayawada cp srinivasulu press meet

ఈ కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం దాదాపు 140 మందిని విచారించడం జరిగిందన్నారు. చోరీ ఎప్పుడు జరిగిందో కశ్చితంగా తెలియకపోవడం, అధారాలు లభించకపోవడం, సీసీ టీవీ పుటేజ్ 15 రోజులకు మించి అందుబాటులో లేకపోవడంతో దర్యాప్తు కొంత క్లిష్టంగా మారిందన్నారు. అనేక మంది పాత నేరస్తులను విచారించిన సందర్భంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జక్కంపూడి సాయిబాబా ఈ వెండి సింహాల ప్రతిమలను అపహరించినట్లు గుర్తించామన్నారు. దొంగిలించిన ఈ వెండి ప్రతిమలను తణుకు తీసుకువెళ్లి బంగారు వ్యాపారి ముత్తు కమలేష్ అనే వ్యాపారికి విక్రయించాడన్నారు. ఈ ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 9 కిలోల వెండితో సహా మొత్తం 15.4 కిలోల వెెండి దిమ్మెలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఆలయాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో విజయవాడ కమిషనరేట్ పరిధిలో దేవాలయాల వద్ద ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టామన్నారు. దేవాలయాలపై దాడులకు పాల్పడే వారిని అడ్డుకోవడంలో ప్రజల సహకారం కీలకమని అన్నారు. ఇటువంటి సున్నితమైన అంశాలపై ప్రజలు, రాజకీయ పార్టీ ల నాయకులు, మీడియా సంయమనంతో వ్యవహరించాలని కోరారు. ఈ చోరీ కేసు చేధించిన ఏసీపీ హనుమంతరావు, సీఐ పి వెంకటేశ్వర్లు, ఇబ్రహీంపట్నం హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ లకు రివార్డు లు అందిస్తున్నట్లు సీపీ తెలిపారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju