Viral News: నెల్లూరు జీజీహెచ్ సూపర్నిటెండెంట్ లైంగిక వేదింపుల బాగోతం మరువక ముందే మరో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఓ ఉన్నతాధికారి లొంగదీసుకున్నాడని ఓ యువతి సోషల్ మీడియాలో విడుదల చేసిన సెల్ఫీ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని రేపింది.

విషయంలోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ యువతికి ఇద్దరు మధ్యవర్తులు ఉద్యోగం ఇప్పిస్తామని కేఆర్ పురం ఐటీడీఏ ఉన్నతాధికారి వద్దకు తీసుకువెళ్లగా ఆయన తణుకులో వార్డెన్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడనీ అయితే ఆ ఉద్యోగం ఇప్పించాలంటే తన కోరిక తీర్చాలని కోరాడన్నారు. ఉద్యోగం కోసం గత్యంతరం లేని పరిస్థితిలో లొంగిపోయాననీ, పలు మార్లు ఆ అధికారి తనతో కోరిక తీర్చుకోవడం కోసం తీసుకువెళ్లాడని ఆరోపించింది. వెళ్లిన ప్రతి సారి మళ్లీ తనతో రమ్మంటూ వేధింపులకు పాల్పడ్డాడనీ, ఆ తరువాత ఉద్యోగం కోసం అడిగినా పట్టించుకోలేదని ఆమె వాపోయింది.
ఉద్యోగం రాకపోగా లొంగిపోయి మోసపోయాననీ, తనలా మరో మహిళకు ఇలా జరగకూడదని ఈ విషయాన్ని బయటపెడుతున్నానని ఆమె పేర్కొంది. ఈ విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వరకూ వెళ్లాలనీ, తనకు న్యాయం చేయాలని ఆ యువతి వేడుకుంది. అయితే ఈ విషయంపై ఆమె పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందజేయలేదు. కానీ ఆ యువతి సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సంబంధిత అధికారులు స్పందించి విచారణ చేస్తున్నట్లు సమాచారం.
ఇది మొత్తం జరిగింది, జరిగిన తరువాత దీనిలో ఒక ట్విస్ట్ ఉందండోయ్.. ఆ ట్విస్ట్ ఏమిటో పార్ట్ 2 లో చూడండి.
Viral News: ఉద్యోగం ఇప్పిస్తానని వాడుకున్నారని యువతి ఆరోపణల్లో పెద్ద ట్విస్ట్..పార్ట్ – 2
నెల్లూరు జీజీహెచ్ ఘటనలో అధికారులు నిర్వహించిన శాఖాపరమైన విచారణలో సూపర్నిటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ వైద్య విద్యార్థినుల పట్ల లైంగికవేధింపులకు పాల్పడినట్లు రుజువు కావడంతో ప్రభుత్వ ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.