Viral News: ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ అధికారి తనను మోసం చేసి లొంగదీసుకున్నాడంటూ సంచలన ఆరోపణలతో ఓ యువతి విడుదల చేసిన సెల్ఫీ వీడియో తీవ్ర కలకలాన్ని రేపిన సంగతి తెలిసిందే. అయితే ఐటీడీఎ పివోపై లైంగిక ఆరోపణలు చేసిన ఆ యువతి మాట మార్చింది. మరో వీడియో సోషల్ మీడియాలో విడుదల చేసింది.

ఉద్యోగం ఇప్పిస్తానని కేఆర్ పురం పివో సూర్యనారాయణ తనను వాడుకున్నాడని తీవ్ర ఆరోపణలు చేసిన ఆ యువతి సాయంత్రం మాట మార్చింది. పిఓను బెదిరిస్తే ఉద్యోగం వస్తుంది, పైగా రూ.5లక్షలు డబ్బులు కూడా వస్తాయని చెప్పి వర్మ, నరేష్ అనే వ్యక్తులు తనతో బలవంతంగా అబద్దం చెప్పించారని పేర్కొంది. ఆ అధికారిని ఉద్యోగం కోసం కలిసిన మాట వాస్తవమేననీ కానీ పివో శారీరకంగా తనను ఏమీ చేయలేదని తెలిపింది. ఆ యువతి ఎలా మాట మార్చిందో మీరు వినండి ఒక సారి.