ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కు తగ్గేది లే..! మరో సారి స్పష్టం చేసిన కేంద్రం..!!

Share

Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను నిరసిస్తూ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్మికుల ఆందోళనకు అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలియజేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం Ap Govt కూడా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి Central పంపింది. సీఎం జగన్ CM YS Jagan కూడా ప్రధాన మంత్రి మోడీకి ఈ అంశంపై లేఖనూ రాశారు. అయినప్పటికీ కేంద్రం ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదనట్లు వ్యవహరిస్తున్నది. తాజాగా మరో సారి కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై తన వైఖరి స్పష్టం చేసింది.

Visakha  Steel Plant Issue central government clarification
Visakha Steel Plant Issue central government clarification

Read More: MP Raghurama: సీఎం వైఎస్ జగన్ ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధమంటూ రఘురామ సంచలన వ్యాఖ్యలు

విశాఖ స్టీల్ ప్లాంట్ ను నూరు శాతం ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నామని కేంద్రం తేల్చి చెప్పింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్న లేవనెత్తగా కేంద్ర మంత్రి భగవత్ కిషన్ రావు కరాడ్ సమాధానం ఇచ్చారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు దర్నాలు, నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ ఏపిలో ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉన్నందున ప్రైవేటీకరిస్తున్నామని ఇప్పటికే కేంద్ర నేతలు ప్రకటనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం మరో సారి దీనిపై స్పష్టత తెలియజేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, కార్మిక సంఘాలు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి. ఇప్పటికే విశాఖ ఉక్కు నిరసన ఉద్యమాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని కార్మిక సంఘాల నేతలు నిర్ణయించారు.

 


Share

Related posts

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లటం పై షాకింగ్ కామెంట్స్ చేసిన నోయల్..!!

sekhar

కమల్ నాథ్ కేబినెట్ లో డిగ్గీరాజా కుమారుడు

Siva Prasad

Mahesh Babu: మరో టార్గెట్ ఫిక్స్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు..!!

sekhar