NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Visakha steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కలిసికట్టుగా పోరాడదామంటున్న విజయసాయిరెడ్డి

Visakha steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళనకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు లభిస్తోంది. నాయకులు ఉద్యమానికి సంఘీభావం తెలియజేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ గేటు వద్ద కార్మికులు నిర్వహించిన బహిరంగ సభలో బుధవారం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్, వామపక్షాల నేతలు పాల్గొని ప్రసంగించారు.

Visakha steel plant : ycp mp vijayasai reddy comments on vsp issue
Visakha steel plant ycp mp vijayasai reddy comments on vsp issue

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అని మొదటి నుండి చెబుతున్నామనీ, అయిదు దశాబ్దాల క్రితం పోరాడి సాధించుకున్న ఈ ఫ్యాక్టరీ ప్రైవేటు పరం కాకుండా ఉండేందుకు అందరం కలిసికట్టుగా పోరాడదామన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం అభియోగాలు, ఆరోపణలు చేసుకోవద్దని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ దారుణ నిర్ణయాన్ని వైసీపీ పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు. ఇప్పటికే ఈ విషయంపై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రధాన మంత్రి మోడికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదనీ, కార్మికుల హక్కులను కాపాడుకునేందుకు ఉద్యమిద్దామన్నారు విజయసాయిరెడ్డి.

ప్రజాభీష్టాన్ని గౌరవించకపోతే కేంద్రంలోని బీజెపీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు మంత్రి అవంతి శ్రీనివాస్. దక్షిణాది రాష్ట్రాలు దేశంలో భాగమేనన్న విషయాన్ని కేంద్ర పాలకులు గుర్తించాలనీ, జాతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ పట్ల వివక్ష చూపుతున్నాయని విమర్శించారు. ఏపి ప్రజలు ఉద్యమబాట పడితే ఆపడం ఎవరితరం కాదని అన్నారు అవంతి శ్రీనివాస్. ఏపికి అన్ని విధాలుగా అన్యాయం చేస్తూ తిరుపతి ఎన్నికల్లో బీజెపీ- జనసేన గెలవాలనుకోవడం సాధ్యమేనా అని  అవంతి  ప్రశ్నించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju