NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Viveka Murder Case: సీబీఐ దర్యాప్తు తీరుపై సుప్రీం కోర్టుకు వైఎస్ సునీతారెడ్డి..?

Viveka Murder Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ కీలక దశకు తీసుకువచ్చింది. అయితే ఈ హత్య కేసులో మొదటి నుండి అనుమానితుల జాబితా ఒకలా ఉంటే, కడప, పులివెందులలో చర్చ ఒకలా ఉంటే..సీబీఐ దర్యాప్తు మరోలా ఉంది. అందరూ ఊహించినట్లుగానే సీబీఐ ఓ చిన్న చేపను పట్టుకుంది. సునీల్ కుమార్ యాదవ్ అనే ఓ చిన్న వైసీపీ కార్యకర్తను వివేకా కేసులో ప్రధాన అనుమానితుడుగా పేర్కొంటూ సీబీఐ అరెస్టు చేసి జైలుకు తరలించింది. అదే విధంగా ఈ కేసులో సునీల్ కుమార్ యాదవ్ కుటుంబ సభ్యులు, వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, వాచ్ మెన్ రంగన్న, కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లా, పీఎ పరమేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డి తదితరులు అనుమానితులుగా ఉన్నారనీ సీబీఐ గడచిన రెండు నెలలుగా వీరిని విచారణ చేస్తోంది. గత 59 రోజులుగా సీబీఐ అధికారులు కడప, పులివెందుల తదితర ప్రాంతాల్లో దర్యాప్తును కొనసాగిస్తూ చిన్న చిన్న వ్యక్తులనే టార్గెట్ చేసి విచారణను కొనసాగించారు. దీంతో సీబీఐ అధికారుల దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Viveka Murder Case suneeta reddy likely to approach supreme court ?
Viveka Murder Case suneeta reddy likely to approach supreme court

Read More: Madhya Pradesh: వరద బాధితులను కాపాడేందుకు వెళ్లి.

ఇదిలా ఉంటే సునీతా రెడ్డి మొదటి నుండి తన తండ్రి వివేకా హత్య కేసులో పెద్దల హస్తం ఉందని ఆరోపిస్తూ ఉన్నారు. అనుమానితుల జాబితాను నాడు హైకోర్టుకు తరువాత సీబీఐ అధికారులకు అందజేశారు. ఆమె సీబీఐ అధికారులకు ఇచ్చిన అనుమానితులను విచారించకపోవడం, వారాలు, నెలల తరబడి చిన్న చిన్న వ్యక్తులను సీబీఐ  విచారిస్తుండటంతో సునీతా రెడ్డి ఈ విషయంపై హైకోర్టు, సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారని  వార్తలు వస్తున్నాయి. గతంలో సిట్ దర్యాప్తు సమయంలోనూ ప్రధాన అనుమానితులను విచారించకుండా చిన్న చిన్న వ్యక్తులను విచారిస్తున్న నేపథ్యంలోనే కేసు దర్యాప్తు పక్కదారి పడుతుందన్న అనుమానం వ్యక్తం చేస్తూ సునీతారెడ్డి హైకోర్టును ఆశ్రయించి సీబీఐ దర్యాప్తును కోరారు. కోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సీబీఐ కూడా సిట్ దర్యాప్తు మాదిరిగానే అనుమానితులుగా ఉన్న ప్రముఖులను వదిలివేసి చిన్న చిన్న వ్యక్తులను విచారిస్తున్న నేపథ్యంలో సునీతారెడ్డి అనుమానాలు, అభ్యంతరాలు తీరలేదు. దీంతో మరో మారు హైకోర్టు లేదా సుప్రీం కోర్టు తలుపు తట్టాలని భావిస్తున్నారని సమాచారం. ఇందు కోసం ఆమె కేరళ సామాజిక కార్యకర్త జెమూన్‌తో, న్యాయనిపుణులతో చర్చిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju