NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Vizag Steel : తేనే పూసిన క‌త్తి… విశాఖ ఉక్కుపై కేంద్రం ఏం చేస్తుందో తెలుసా?

AP Politics : News Strategy

Vizag Steel : మ‌రోమారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విష‌యంలో కీల‌క అప్‌డేట్ తెర‌మీద‌కు వ‌చ్చింది. ఏపీకి ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిన
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం క్రమంగా ముందుకే అడుగులు వేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంటు కు లాభాలు వచ్చే అవకాశాలున్నా.. కేంద్రం అమ్మేయడానికి సిద్దపడిందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ నెత్తి నోరూ బాదుకుని చెబుతూనే ఉన్నారు. కానీ కేంద్రం మాత్రం తాను అనుకున్న దారిలోనే వెళ్తోంది. ఇప్పుడు మరోసారి ఇదే అంశం తెర మీదకు వచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహరం ఓవైపు జరుగుతున్న సందర్భంలో కేంద్రంలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు ఏపీకి కీలకం కానున్నాయి.

AP Politics : News Strategy

విశాఖ ఉక్కు … కాదు ఆంధ్రుల హ‌క్కు

గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ రాశారు.. ఆ లేఖకు సమాధానంగా కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి ఠాకూర్ తాజాగా లేఖ రాశారు. ఉక్కు ప్రైవేటీకరణతో అందరికీ మంచే జరుగుతుందని లేఖలో తెలిపిన ఆయన.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడతామని వివరణ ఇచ్చారు. ఉక్కు సంస్థలో వంద శాతం పెట్టుబడులు ఉపసంహరించాలని కేంద్ర కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుందని లేఖలో స్పష్టం చేసిన ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణవల్ల అంతా మంచే జరుగుతుందని, ఉత్పత్తి పెరుగుతుందని, అందులో పనిచేసే ఉద్యోగులు, భాగస్వామ్య పక్షాలకు న్యాయం జరిగే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.

కేంద్రం మొండి వైఖ‌రి

విశాఖ స్టీల్ ప్లాంటు కు లాభాలు వచ్చే అవకాశాలున్నా.. కేంద్రం అమ్మేయడానికి సిద్దపడింది. స్టీల్ ప్లాంట్ పూర్తిగా అప్పుల్లో ఉంది. పూర్తి స్థాయి నష్టాల్లో కూరుకుపోయింది. ఈ పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ భారాన్ని కేంద్ర ప్రభుత్వం మోయలేదు.. భరించ లేదు. కాబట్టి స్టీల్ ప్లాంటును అమ్మేస్తున్నామని కేంద్రం అదే పనిగా చెప్పుకుంటూ వస్తోంది. భవిష్యత్తులో విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి రావడం ఖాయమని ప్లాంట్ యాజమాన్యం చాలా స్పష్టంగా చెప్పింది. ఎవరి లెక్కలు చూసి స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించుకుందో వారి లెక్కలే ఇప్పుడు ప్లాంట్ లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందని స్పష్టంగా చెబుతున్నాయి. ఐదేళ్ల నష్టాలు.. పెండింగులో ఉన్న పన్నుల బకాయిలని చెల్లించాక కూడా లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని తాజాగా ఓ ఆర్టీఐ ద‌ర‌ఖాస్తులో ఆర్ఐఎన్ఎల్ స్పష్టంగా చెప్పేసింది. దీంతో కేంద్రం చెప్తున్న మాట బూట‌క‌మ‌ని ప‌లువురు కామెంట్ చేస్తున్నారు.

author avatar
sridhar

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?