NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు సినిమా

Vizag Steel : సినీ హీరోల్లారా…. కాస్త `విశాఖ ఉక్కు` ప‌ట్టించుకోండి

AP Politics : News Strategy

Vizag Steel :ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌.విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగుతోంది. ఇప్ప‌టికే దీనికి వివిధ వ‌ర్గాలు మ‌ద్ద‌తు తెలిపాయి. ఇప్ప‌టికే ప్రముఖ సినీనటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు చిరంజీవి మద్దతు ప్రకటించారు. అయితే, మ‌రికొంద‌రు మాత్రం మ‌ద్ద‌తు తెల‌ప‌క‌పోవ‌డంతో వారికి షాక్‌లు త‌గులుతున్నాయి. తాజాగా టాలీవుడ్‌ హీరో మంచు విష్ణుకు విశాఖ ఉక్కు నిరసన సెగ తగిలింది.

Vizag Steel : విశాఖ వెళ్లిన మంచు విష్ణుకు ఏం జ‌రిగిందంటే…

సినిమా ప్రమోషన్‌ కోసం విశాఖ వెళ్లిన మంచు విష్ణును…నిరసనకారులు అడ్డుకున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమానికి టాలీవుడ్‌ మద్దతు ఇవ్వాలని.. సినీ ప్రముఖులు ఎవరు వచ్చినా అడ్డుకుంటామని కార్మికులు హెచ్చరించారు. ఈ సందర్భంగా స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమానికి మంచు విష్ణు మద్దతు ఇవ్వాలని నిరసనకారులు వినతి పత్రం అందజేశారు. అయితే దీనిపై మంచు విష్ణు స్పందిస్తూ విశాఖ ఉద్యమానికి మద్దతు తెలపాలని సినీ ప్రముఖులకు ఉన్నా రాజకీయ కారణాల వల్ల ముందుకు రాలేకపోతున్నారని మంచు విష్ణు పేర్కొన్నారు. సినీ పెద్దల నిర్ణయం ప్రకారం ముందుకెళ్తామని ఆయన తెలిపారు. ప్రైవేట్‌ వ్యక్తులు లాభాల్లో నిర్వహిస్తామన్నప్పుడు, ప్రభుత్వానికి ఎందుకు సాధ్యం కాదని మంచు విష్ణు ప్రశ్నించారు.

చిరు ఏమన్నారంటే…

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమానికి చిరంజీవి ఆదిలోనే మద్దతు ప్రకటించారు. కాలేజీ రోజుల్లోనే విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొన్నానని నాటి రోజులను ఆయన గుర్తు చేశారు. కాలేజీలో చదువుకునే సమయంలో విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని బ్రష్‌తో రాశానని చెప్పారు. నష్టాల పేరుతో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామనడం దారుణం అని చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతాలు, పార్టీలకతీతంగా అందరూ పోరాడాలని చిరంజీవి పిలుపునిచ్చారు.

లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన విశాఖ ఉక్కును ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నాలను కేంద్రం విరమించుకోవాలని కోరుతున్నాను. ఉద్యోగులు, కార్మికుల భవిష్యత్తును, ప్రజల మనోభావాల గుర్తించి కేంద్రం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలి. ఉక్కు సంకల్పంతో విశాఖ ఉక్కును కాపాడుకుందాం’ అంటూ చిరంజీవి పిలుపునిచ్చారు.కాలేజీ రోజుల్లోనే విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొన్నానని నాటి రోజులను ఆయన గుర్తు చేశారు. కాలేజీలో చదువుకునే సమయంలో విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని బ్రష్‌తో రాశానని చెప్పారు

author avatar
sridhar

Related posts

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu