AP Police : అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ఆంధ్ర ప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలీసు శాఖ సర్వ సన్నద్ధం అయింది. ఎన్నడూ లేనట్లుగా ఈసారి పోలీసు సిబ్బందిని ఎక్కువగా గ్రామాల్లో నియమించనున్నారు. గ్రామీణ వాతావరణంలో శాంతిభద్రతల సమస్యలు రాకుండా పోలింగ్ సజావుగా సాగేందుకు ఏపీ పోలీసులు AP Police అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మొత్తం నాలుగు విడతలుగా సాగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష పార్టీల మద్దతుదారుల మధ్య ఎక్కడ మాట మాట పెరగడం గాని చిన్న వివాదం కూడా లేకుండా ఎన్నికలు జరిపించేందుకు ఏపీ పోలీసులు యూట్యూబ్ సాంకేతికత అటు సిబ్బంది సేవలను సమానంగా వినియోగించుకోనున్నారు. ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాలను గుర్తించిన పోలీసులు అక్కడ ఏ విధమైన సమస్య రాకుండా చూసేందుకు అదనపు బలగాలను మోహరించారు. దాదాపు నాలుగు దశలో ఎన్నికల్లోనూ దాదాపు సమానమైన లెక్కలోనే ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మొదటి దశ పోలింగ్ పూర్తవగానే రెండో దశకు అక్కడ సిబ్బందిని వినియోగించుకోనున్నారు అలాగే నాలుగు దశలను సమానంగా పోలీసులకు విధులు వేస్తున్నారు.

మూడో దశలోనే కీలకం!
మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో 8260 3 పోలింగ్ స్టేషన్ ప్రాంతాలు, 33,069 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ దశలోనే అత్యంత సమస్యాత్మక గ్రామాలు పంచాయతీలు కనిపిస్తున్నాయి. వీటిలో సుమారు 1500 పోలింగ్ స్టేషన్లను అత్యంత సమస్యాత్మక, 2300 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. అయితే మొత్తం పంచాయతీ ఎన్నికల్లో మూడో దశ అత్యంత కీలకం గా కనిపిస్తోంది. ఈ దశలో ఏకంగా 876 కీలకమైన అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో మూడో దశ మీద పోలీస్ శాఖ ప్రత్యేకంగా అదనపు సిబ్బందిని నియమించింది. మొదటి దశతో పాటు మూడో దశ ను విజయవంతంగా పూర్తిచేస్తే మిగిలిన దశలను చాలా సులభంగానే పూర్తి చేయవచ్చు అనేది పోలీసుశాఖ భావన. దీంతో కీలకమైన మొదటి, మూడో దశ మీదే పోలీసుశాఖ ప్రధానంగా దృష్టి పెట్టింది.
ప్రణాళిక అమలు!
ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలీసు శాఖ తరపున సాంకేతికతను ఎక్కువగా వినియోగించుకోనున్నారు. దీంతోపాటు ముందుగానే పోలీస్ సిబ్బంది సమస్యాత్మక గ్రామాల్లో పర్యటించి అక్కడున్న ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయాలని భావిస్తున్నారు. ఫ్యాక్షన్ ప్రాంతాలతో పాటు అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేకమైన చర్యలు చేపట్టనున్నారు. post-poll స్ట్రాటజీ విలేజ్ విజిట్, టెక్నాలజీ మీద ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. అలాగే ఈ సారి సోషల్ మీడియాలో ఎన్నికల వేళ వచ్చే ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించి అందుకు ప్రత్యేకమైన బృందాన్ని నియమించారు.
ఇవి లెక్కలు!
** మొత్తం పోలీసుల రికార్డుల్లో నమోదైన పబ్లిక్ ప్రైవేట్ ఆయుధాలు – 9942
** ఎప్పటి వరకు డిపాజిట్ చేసినవి – 9199
** ఎప్పటి వరకు బైండోవర్ చేసిన కేసులు – 1,47,391
** సిజ్ అయిన డబ్బు : 5,02,49,000
గోల్డ్ – 9.55 కేజీ లు
** వాహనాలు – 125
క్షేత్ర స్థాయిలో ఎన్నికలను ఎప్పటికప్పుడు పరిశీలించి బృందాలు – రూట్ మొబైల్స్ – 1122, స్ట్రైకింగ్ ఫోర్స్ – 257, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ – 143, మొబైల్ చెక్ పోస్ట్ – 199.
నమోదు అయిన కేసులు
** హత్యాయత్నం నేరాలు – 2
నిందితులు – 30
** దాడులు – 8
నిందితులు – 112
** విధులను ఆటంక పరచడం – 7 కేసులు
నిందితులు – 20
** ఇతర కేసులు – 24
నిందితులు – 91
** ఎస్సీ ఎస్టీ కేసులు – 3
నిందితులు – 19
** ఎన్నికల ముందు జరిగిన సంఘటనలు 2013లో 87 జరిగితే, ప్రస్తుతం 44 నమోదయ్యాయి.