NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ టాప్ స్టోరీస్

న్యాయమా నువ్వేటు? ఆంధ్రప్రదేశ్లో చిత్రవిచిత్రాలు!!

 

 

**న్యాయస్థానాల్లో కేవలం న్యాయం మాత్రమే దక్కాలి… అక్కడ మరే ఇతర వ్యవహారాలకు చోటు ఉండకూడదు… అందుకే న్యాయస్థానాల్లో న్యాయదేవత బొమ్మకు కళ్ళకు గంతలు కడతారు… ముందున్న వారు ఎంత పెద్ద వారైనా ఎవరైనా… చూసి చెప్పకుండా కేవలం విని మాత్రమే న్యాయం చెప్పాలనేది ఆ బొమ్మ యొక్క ప్రతీక… మరి అంతటి న్యాయవ్యవస్థలో ఇప్పుడు ఏం జరుగుతోంది..?? ఎందుకు న్యాయవ్యవస్థలోనే విభిన్నమైన ప్రకటనలు ఎందుకు?? కొన్ని విషయాల్లో అత్యుత్సాహం న్యాయమూర్తుల్లో అవసరమా?? న్యాయమూర్తులు అంటే న్యాయానికి అతీతంగా ఉండే వారా?? ఎందుకీ పెడ ధోరణి?? దీనివల్ల ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్న ట్లు అనే అనేక ప్రశ్నలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీరు పట్ల వ్యక్తమవుతున్నాయి… కొందరు న్యాయమూర్తుల అతి ప్రవర్తన, అతి ప్రకటనలు, అతిగా స్పందించే తీరు.. ఇప్పుడు మొత్తం న్యాయ వ్యవస్థ పక్షానికి మాత్రమే న్యాయం చేస్తుందని ప్రజలు అనుకునే పరిస్థితి వస్తోంది.

** ప్రభుత్వానికి హైకోర్టు కు మధ్య జరుగుతున్న కేసుల్లో చాలావరకూ భిన్నమైనవే. ప్రభుత్వం చేసే తప్పులు పై పిటిషన్ వేయడం వాటిని వెంటనే హైకోర్టు తీసుకోవడం విచారణ మొదలు పెట్టడం ఒక ఎత్తయితే… కొన్ని అనవసర విషయాల్లో సైతం హైకోర్టు అతి స్పందన ప్రమాదకరంగా మారుతోంది. ఈ స్పందన కొందరు జడ్జిల తీరు పట్ల అన్ని వర్గాల్లోనూ ఆశ్చర్యం కలిగిస్తుంటే న్యాయ నిపుణులు మాత్రం ఇది న్యాయ వ్యవస్థ తీరు ఒక మాయని మచ్చ లా ఉండిపోతుందని వ్యాఖ్యానిస్తున్నారు.
** డాక్టర్ సుధాకర్ పై రోడ్డు పై దాడి జరిగిన కేసు విషయం తీసుకుంటే… దానికి కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ కేసు అప్పగించడం హైకోర్టు అతి ప్రవర్తనగా భావించాలి. ఒక వ్యక్తిపై దాడి కేసు లేదా అదే వ్యక్తి తాగి రోడ్డుపై గొడవ సృష్టించాడు అన్నది చాలా చిన్న విషయం. అందులోను డాక్టర్ సుధాకర్ ఏమి పెద్ద పేరున్న వ్యక్తి తో లేక సమాజంలో పెద్ద వ్యక్తి అయితే ఆ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకోవచ్చు… అయితే ఈ కేసును హైకోర్టు పెద్ద సీరియస్ గా తీసుకోని ఏకంగా ఒక సాధారణ వ్యక్తి మీద కేసును దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ కు ఇవ్వడం విచిత్రమే.
** సోషల్ మీడియాలో కోర్టులను కొందరు అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసు విషయంలో హైకోర్టు అతిగానే స్పందించింది. ఈరోజుల్లో సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ట్రోలింగ్ పెళ్లి చేసుకోవడం తిట్టుకోవడం పరిపాటిగా మారింది. ఈ కేసు విషయంలో సాధారణ పోలీసు కేసు పెట్టి.. కోర్టులను అనుచితంగా తిట్టే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు అయితే బాగుండేది.. ఈ కేసులో హైకోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కు కేసును అప్పగించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 60 మంది వరకు నోటీసులు అందుకున్న వారిని గుర్తించిన సిబిఐ దానిలో పెద్దగా చేసిందేమీ లేదు. దీనిలో పెద్దగా దర్యాప్తు చేయడానికి ఏమీ లేదు. కేవలం పోస్టులు పెట్టిన వారు ఎవరైనా ప్రేరేపిస్తే వాటిని పెట్టారా లేక సొంతంగా పెట్టారా అన్న విషయాన్ని మాత్రమే సీబీఐ కోర్టుకు నివేదించింది.
** రాజ్యాంగ విచ్ఛిన్నం కేసుకు సంబంధించి జస్టిస్ రాకేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు పిటిషన్లను ఆధారాలతో సహా పిటిషన్ వేయాలని ప్రోత్సహించిన తీరు అభాసుపాలైంది. కేసు విచారణను ఏదిఏమైనా తానే చేపడతా అంటూ రాజేష్ కుమార్ చెప్పడం కూడా న్యాయనిపుణులు ఆశ్చర్యపరిచింది.
ఇలాంటివి ఒకటి కాదు రెండు కాదు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో ఎన్నో విచిత్రాలు, ఇంకెన్నో ఆశ్చర్యం గొలిపే అంశాలు జరుగుతూనే ఉన్నాయి. హైకోర్టు ఓ ఆర్టికల్ ఏదో వర్గానికి కొమ్ముకాస్తున్న ట్లుగా లేదా కొందరు కావాలని ఇబ్బంది పెడుతున్నట్లు గా న్యాయస్థానాలు వ్యవహరించడం వాటి తీరు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సైతం తికమక చేస్తోంది. న్యాయస్థానాల మీద అపనమ్మకం కలిగేలా చేస్తోంది.

author avatar
Comrade CHE

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !