Subscribe for notification

ఎన్నికల గోలలో గెలుపు ఎవరిదీ?? చట్టం చెబుతున్నది ఏమిటి??

Share

 

 

ఎన్నికల గోలలో గెలుపు ఎవరిదీ?? చట్టం చెబుతున్నది ఏమిటి??

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో గెలుపు ఎవరిది..? ఇంతటి పెద్ద ప్రభుత్వం మీద నిమ్మగడ్డ రమేష్ గర్జించు దానికి గల కారణాలు ఏమిటి? తన ఇష్టం వచ్చినట్లు నోటిఫికేషన్లు విడుదల చేసుకోవడంలో ఆంతర్యం ఏముంది? అసలు మొత్తం ఈ ఎపిసోడ్ లో గెలుపు ఎవరిది? భవిష్యత్తులో ఇది ఎంతవరకు వెళ్ళనుంది.. ఏం జరగనుంది? అంటే దీనికి న్యాయ నిపుణులు చెబుతున్న లెక్కల ప్రకారం మాత్రం ఇప్పటివరకు పరిస్థితిని బేరీజు వేసి కోర్టులకు వెళితే మాత్రం ఎన్నికల కమిషన్ కే లీడింగ్ విజయాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఇది కోర్టు మెట్లు వరకు ఎక్కితే రాజ్యాంగ మౌలిక సూత్రాలను లోబడి ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీద విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అనేది న్యాయ నిపుణులు చెబుతున్న మాట. ఎందుకు అంటే ఒక సారి పరిశీలిద్దాం…

 

అధికారణ 243 (కే) చెబుతున్నది అదే!!

రాజ్యాంగంలో ఎన్నికల కమిషన్ కు సర్వస్వతంత్ర తర్వాత ఇవ్వడంతోపాటు వారి విధులు ఏమిటన్నది స్పష్టంగా తెలిపారు అలాగే వారి అధికారాలు ఎలా ఉంటాయి అనేది రాజ్యాంగంలో ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 243 (కే) లో ఇది స్పష్టంగా రాసిపెట్టి ఉంది. స్థానిక సంస్థలను ఆయా రాష్ట్ర గవర్నర్ల చే నియమింపబడిన ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహించాలి. స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు నిర్వహణ విషయంలో తుది నిర్ణయం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనేది స్పష్టంగా పేర్కొన్నారు. సర్వ స్వతంత్రత ఉన్న ఎన్నికల కమిషన్ కు ఇది ఒక ప్రత్యేకమైన ఆర్టికల్. అంటే ఇప్పుడు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యాంగంలోని ఈ మౌలిక ఆదేశాలను బేసిక్ గా తీసుకొని ప్రభుత్వంతో పోరాడుతున్నట్లు అర్థమవుతోంది. ఆయన అందరు న్యాయనిపుణుల సలహా మేరకు మాత్రమే కోర్టులో కేసులను, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు లేఖలు రాస్తున్నారు. దీంతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు రాజ్యానికి జరిగిన వివాదాల్లో గతంలో కర్ణాటకలోనూ అస్సాంలోనూ వచ్చిన తీర్పులను ఒకసారి పరిశీలిస్తే అవి ఎన్నికల కమిషన్ కు అనుకూలంగా వచ్చిన తీర్పులే. రాజ్యాంగంలో ఉన్న మౌలిక లక్షణాలను బట్టి ఎన్నికల కమిషన్ కు ఉన్న అధికారాలను రాజ్యం అడ్డుకోలేదని పలు రాష్ట్రాల హైకోర్టు ఇచ్చిన తీర్పులను ఇక్కడ ఊటంకించవచ్చు. అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఎంతో బలమైన శక్తి కావడంతో దానిలో ఉన్న విషయాలను అర్థం చేసుకున్న తర్వాతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వంతో ఈ పేచీకి దిగినట్లు స్పష్టమవుతోంది.

సుప్రీం ఎం చేస్తుంది అన్నది కీలకం!!

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వానికి సంబంధించిన కేసులో ఇప్పటికే హైకోర్టులో నడుస్తోంది. ఇటీవల హైకోర్టు మధ్య మార్గంగా ముగ్గురు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి ఐఏఎస్ అధికారులను, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వద్దకు పంపించి రాజీ చేయడానికి ప్రయత్నించింది. అయితే అది అంత విజయం సాధించలేకపోవడంతో.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకంగా ఎన్నికల షెడ్యూల్ను ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి లేఖలు రాసి తనకు ఎన్నికలకు జరపడానికి వీలుగా సిబ్బందిని కేటాయించాలని కోరగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి ససేమిరా అంటోంది. ఎన్నడూ లేనట్లుగా మంత్రులు ఉద్యోగ సంఘాలు పోలీసులు సైతం తాము ఎన్నికలను బహిష్కరిస్తామని చెప్పడాన్ని చూస్తే ఇది కొత్త వివాదానికి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
** ఒక రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయా తేదీలను అనుసరించి మేం ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నప్పుడు కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ సిబ్బంది వారికి సహకరించాలి. అలా కాకుండా ఇప్పుడు ఎదురు తిరిగే పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఇది కచ్చితంగా ఎన్నికల కమిషన్ కే ప్లస్ అవుతుంది.


** ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలను అడ్డుకునే వాయిదా వేసే హక్కు లేదు. అధికారంలో ఉన్న పార్టీ తాము గెలవలేము అనుకున్నప్పుడు ఇలాగే ఎన్నికలు వాయిదా వేస్తే మొత్తం రాజ్యాంగ ఉల్లంఘనే జరుగుతుంది. ప్రస్తుతం జగన్మోహన్రెడ్డి గెలవలేం అనే కోణం కంటే తన అహం దెబ్బతినడంతో నే ఎన్నికలను వద్దని, చెబుతున్నారు. అంటే భవిష్యత్తులో మరో రాష్ట్ర ప్రభుత్వం మాకు స్థానిక సంస్థల ఎన్నికలు వద్దు మేము పెట్టడం అంటే అవి కొత్త వివాదాలకు దారి తీసే అవకాశం ఉంది. అంటే ఇది ఇప్పటి తో పోయే సమస్య కాదు. భవిష్యత్తులోనూ ఇతర రాష్ట్రాలకు ఎలాంటి సమస్యలు మార్గనిర్దేశం అవుతాయి కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్లినా ఎన్నికల కమిషన్ తీర్పు వచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
** భారత అత్యున్నత న్యాయస్థానం కోర్టులోకి ఒక కేసు వెళ్లిందంటే దానిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చే తీర్పు భవిష్యత్తులో ఒక కేసును ప్రభావితం చేయవచ్చు. వ్యవస్థలను సైతం ప్రభావితం చేయవచ్చు. అందుకే సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని మాత్రమే ఎలాంటి ఇబ్బంది లేకుండా, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాత్రమే వ్యాఖ్యలు, తీర్పులు ఇస్తుంది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిన రాజ్యాంగంలో ఉన్న అధికారనల మేరకు మాత్రమే తీర్పు రావాలి. అది భవిష్యత్తులో ఇబ్బందులను తీర్చేది తప్ప సృష్టించేది అయి ఉండకూడదు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమాత్రం సంప్రదించకుండా ఎన్నికలను వాయిదా వేయడం ఒక చిన్న పొరపాటు కింద మాత్రమే కోర్టు చూస్తుంది. కానీ ఎన్నికల ఎన్నికల కమిషన్ వీధుల్లో రాష్ట్ర ప్రభుత్వం తలదూర్చి తమకు ఎన్నికలు వద్దు అని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమే. అంటే ఈ కేసులో ఏం జరగబోతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది.

** డబ్బు ఖర్చు తప్ప!!

రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఈ కేసు విషయంలో వెళితే కేవలం ఖర్చు తప్ప మరింకేమిటి ఉండదు. ఇప్పటికే ఈ కేసు విషయంలో రాష్ట్ర హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సుమారు 7 కోట్ల వరకు ఖర్చు పెట్టింది. ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే దానికి రెండింతలు అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే సుప్రీం కోర్టు లాయర్ లో గంటకు ఇంత చొప్పున ఫీజులు వసూలు చేస్తారు. అంటే సుప్రీం కోర్టు దీనిని ఏమైనా అత్యవసర కేసు కింద పరిగణిస్తే.. తక్కువ వాయిదాలతోనే సరి పోతుంది లేకుంటే మాత్రం తడిసి మోపెడు అవ్వడం ఖాయం. చివరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించే అవకాశాలు ఉండవు. మిగిలేది ఆఖరుకు 0 మాత్రమే…

 


Share
Comrade CHE

Recent Posts

Hero Yash: పాన్ ఇండియా నిర్మాతల వేటలో హీరో యశ్

Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…

9 mins ago

Pakka Commercial: `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` ఓటీటీ రైట్స్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`.…

40 mins ago

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

1 hour ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

2 hours ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

2 hours ago

Breaking: ఎంపీ రఘురామకు హైకోర్టులో ఊరట.. లంచ్‌మోషన్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు

Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…

2 hours ago