NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌రం ముగిసింది. సోమ‌వారం ఉద‌యం నుంచి ప్రారంభ‌మైన ఓట్ల ప్ర‌క్రియ మంగ‌ళ‌వారం తెల్ల‌వారు జామున 2 గంట‌ల వ‌ర‌కు జ‌రిగింది.(కొన్ని పోలింగ్ బూతుల్లో). దీంతో ఎన్నిక‌ల సంఘం అధికారిక లెక్క‌ల ప్ర‌కారం రాష్ట్ర వ్యాప్తం గా 81.17 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇదేమీ చిన్న విష‌యం కాదు.. ఒక‌ర‌కంగా చెప్పాలంటే రాష్ట్రంలో స‌రికొత్త చ‌రిత్ర న‌మోదై న‌ట్టే. దీనిని ఎవ‌రూ ఊహించ‌లేదు కూడా. ఎన్నిక‌ల సంఘం కూడా.. 80 శాతానికి ప‌రిమిత‌మైంది. ఈ మేర‌కు అయ్యే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేసింది. అయితే.. పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి పోటెత్తిన ఓట‌రుతో పోలింగ్ శాతం గ‌తంలో క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో న‌మోదైంది.

స‌రే.. ఇప్పుడు అస‌లు సంగ‌తి ఓటరు ఎటున్నాడు? ఎవ‌రికి ప‌ట్టం క‌ట్టాడు? ఏ ప‌క్షం వైపు నిల‌బ‌డ్డాడు? ఎవ‌రిని ముఖ్య‌మంత్రి ని చేస్తున్నాడు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. వాస్త‌వ ఫ‌లితం జూన్ 4న రానుంది. కానీ, ఈలోపే.. పోలింగ్ శాతం.. కులాలు, మ‌తాలు.. వ‌ర్గాలు.. ప్రాంతాల వారీగా.. ఓటరు నాడిని ప‌ట్టుకునేందుకు అన్ని పార్టీలూ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఆది నుంచి వ‌స్తున్న అంచ‌నాల‌కు భిన్నంగా ఓట‌ర్లు పోటెత్త‌డంతో ఆ అంచ‌నాలు కూడా బ‌దాబ‌ద‌ల‌య్యాయ‌నే టాక్ వినిపిస్తోంది. అంటే.. ఒక‌ప్పుడు సీమ‌లో వైసీపీ ఏక‌ప‌క్షంగా దూసుకురావ‌డం ఇప్పుడు ఉండే క‌నిపించే అవ‌కాశం ఉండ‌ద‌ని అంటున్నారు.

ఎందుకంటే.. ఇక్క‌డ కూడా స్థానికంగా జిల్లాల వారీగా చూసుకుంటే.. క‌ర్నూలులో 85 శాతం, అనంత‌పురంలో 82 శాతం, క‌డ‌ప‌లో 80 శాతం, చిత్తూరులో 83 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో ఇక్క‌డ వైసీపీ ఏక‌ప‌క్షంగా ఉన్న అన్ని స్థానాల్లోనూ దూసుకుపోయే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. పైగా వైఎస్ ష‌ర్మిల‌, సునీత‌ల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న క‌డ‌ప‌లోనే గ‌తంలో కంటే ఎక్కువ‌గా పోలింగ్ న‌మోదైంది. దీంతో ఇక్క‌డ మార్పులు ఖాయ‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే.. అది కాంగ్రెస్‌కు కాకుండా కూట‌మి అభ్య‌ర్థుల‌కు మేలు చేస్తే.. వైసీపీకి పెను దెబ్బ త‌ప్ప‌దని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

ఉత్త‌రాంధ్ర‌లోనూ 80 శాతానికి పైగా ఓట్లు పోల‌య్యాయి. ఇక్క‌డి మూడు జిల్లాల్లోనూ టీడీపీ భారీగా పుంజుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. వైసీపీ పెట్టుకున్న అంచ‌నాలు పెద్ద‌గా వర్క‌వుట్ కాలేద‌ని తెలుస్తోంది. ఇక‌, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన ప‌ట్టు బిగించిన‌ట్టేన‌ని అంటున్నా.. కొన్ని లోపాలు కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తున్నాయి. అదేస‌మ‌యంలో ముద్ర‌గ‌డ పద్మ‌నాభం ఏమేర‌కు ఓట్లు చీల్చ‌డంలో స‌క్సెస్ అయ్యార‌నేది ప్ర‌శ్న‌గా మారింది. ఓటింగ్ స‌ర‌ళి, పోలైన ఓట్ల త‌ర్వాత‌.. ఆయ‌న మీడియా ముందుకు రాక‌పోవ‌డం కూడా అనేక అనుమానాల‌కు తావిస్తోంది. మొత్తంగా చూస్తే.. ఓటరునాడి మాత్రం చాలా భిన్నంగా ఉంది. ఎవ‌రికీ ఏక‌ప‌క్షం కాకుండా.. చాలా వ్యూహాత్మ‌కంగా నే అడుగులు వేసిన‌ట్టు తెలుస్తోంది.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?