NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప‌శ్చిమ‌గోదావ‌రిలో ఆ నాలుగు రిజ‌ర్వ్‌డ్ సెగ్మెంట్ల‌లో గెలుపు ఎవ‌రికంటే..?

పశ్చిమ గోదావరి జిల్లాలోని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖ‌రార‌య్యారు. వైసీపీ, జ‌న‌సేన‌, బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేశారు. అభ్యర్థులు ప్రచారాన్ని జోరుగా సాగిస్తు న్నారు. ఈ నేప‌థ్యంలో కీలక నియోజకవర్గాలైన ఎస్సీ స్థానాల్లో అభ్యర్థుల మధ్య పోరు హోరా హోరీగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఏ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

+ గోపాలపురం(ఎస్సీ): మంత్రి తానేటి వనిత వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి మద్దిపాటి వెంకటరాజు పోటీ చేస్తున్నారు. వ‌నిత‌కు ఈ నియోజ‌క‌వ‌ర్గం పాత‌దే. గ‌తంలోనూ గెలిచారు. దీంతో ఆమె ధైర్యంగా ఉన్నారు. మ‌ద్దిపాటికి సొంత పార్టీలో చిన్న చిన్న త‌ల‌నొప్పులు ఉన్నా క్లీన్ ఇమేజ్‌తో, యువ‌నేత‌గా బ‌రిలోకి దిగ‌డం ప్ల‌స్ కానుంది.

+ చింతలపూడి(ఎస్సీ): కంభం విజయరాజు వైసీపీ త‌ర‌ఫున‌ పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన‌ సొంగ రోషన్‌ పోటీకి దిగారు. ఇద్ద‌రూ కొత్త‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. ఇరు పార్టీల్లోనూ టికెట్ ద‌క్క‌లేద‌న్న అసంతృప్తులు ఉన్నారు. అయితే విజ‌య‌రాజును నిన్న‌టి వ‌ర‌కు బ‌లంగా స‌పోర్ట్ చేసిన ఎంపీ వ‌ర్గం ఇప్పుడు టిక్కెట్ వ‌ద్ద‌నేంత రేంజ్‌లో వ్య‌తిరేకిస్తుండ‌డం వైసీపీని డీలా ప‌డేలా చేయ‌గా.. టీడీపీలో జోష్ నింపుతోంది.

+ కొవ్వూరు(ఎస్సీ): తలారి వెంకట్రావు వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు బరిలోకి దిగుతున్నారు. ముప్పిడి ఇక్క‌డ వ‌ల‌స నేత‌. గోపాల పురం నుంచి వ‌చ్చిపోటీ చేస్తున్నారు. దీంతో ఈయ‌న‌కు స్థానిక టీడీపీ, జ‌న‌సేన కేడ‌ర్ స‌హ‌కారం పూర్తిగా ఉంది. అటు వైసీపీ నేత వెంక‌ట్రావు కొత్తే అయినా.. స్థానిక నేత‌లు ఆయ‌న‌ను స్వాగ‌తిస్తున్నారు. దీంతో ఇక్క‌డ ఎన్నిక హెరాహోరీగా పైకి క‌నిపిస్తున్నా కూట‌మికి స్వ‌ల్ప ఎడ్జ్ ఉందంటున్నారు.

+ పోల‌వ‌రం(ఎస్టీ): ఇక్క‌డ నుంచి వైసీపీ అభ్యర్థిగా తెల్లం రాజ్యలక్ష్మిని బరిలోకి దింపారు. ఈమె స్థానికురాలు. పైగా రాజ‌కీయ నేప‌థ్యం ఉంది. కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి చిర్రి బాలరాజు పోటీ చేస్తున్నారు. అయితే.. ఇరు పార్టీల్లోనూ అసంతృప్తి ఉంది. త‌కు టికెట్ రాలేద‌ని.. నాయ‌కులు ర‌గిలిపోతున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యానికి ఇక్క‌డి నేత‌లు వ్య‌వ‌హ‌రించే తీరుపైనే అభ్య‌ర్థుల గెలుపు ఆధార‌ప‌డి ఉంటుంద‌ని అంటున్నా ప్ర‌స్తుతానికి వైసీపీకి స్వ‌ల్ప ఎడ్జ్ ఉంది.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

AP SSC Results: ఏపీలో టెన్త్ ఫలితాలు వచ్చేశాయోచ్ .. పార్వతీపురం మన్యం ఫస్ట్ .. కర్నూల్ లాస్ట్.. రిజల్ట్స్ ఇలా తెలుసుకోండి

sharma somaraju

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Maldives Parliamentary Elections: మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో ముయిజ్జు పార్టీ హవా

sharma somaraju

Lok Sabha Elections 2024: భారీ భద్రత నడుమ మణిపూర్ లో కొనసాగుతున్న రీపోలింగ్

sharma somaraju

కిష‌న్‌రెడ్డిని ద‌గ్గ‌రుండి మ‌రీ గెలిపిస్తోన్న కేసీఆర్, రేవంత్‌..!

2019కు రివ‌ర్స్‌లో… గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఆ నాలుగు ఎంపీ సీట్ల ఫ‌లితాలు…!

రాజమండ్రి సిటీలో వైసీపీ భ‌ర‌త్ Vs టీడీపీ వాసు… హీరో ఎవరో తేలిపోయిన‌ట్టే…?

రాజమండ్రి రూరల్ రిపోర్ట్‌: ‘ టీడీపీ బుచ్చయ్య ‘ గెలుస్తాడా…?

Congress: ఏపీలో మరో 9మందితో కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ధుల ప్రకటన

sharma somaraju

AP Elections 2024: అనపర్తి నుండి పోటీ చేసేది బీజేపీ అభ్యర్ధే .. కానీ ..సమస్య పరిష్కారం అయ్యింది ఇలా..!

sharma somaraju

YS Sharmila: జగన్ ఇచ్చిన అప్పుపై షర్మిల ఇచ్చిన క్లారిటీ ఇది

sharma somaraju