NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

దేవుడు మీద భారం : ఇంటిలిజెన్స్ ఎం చేస్తోంది??

“దేవుడి పేరుతో కొందరు రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు… అలాంటి వారికి దేవుడే తగిన బుద్ధి చెబుతాడు”” అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవేదన తో కూడిన స్వరం పెంచి వ్యాఖ్యనించారు… రాష్ట్రంలో హిందూ ఆలయాలు మీద జరుగుతున్న వరుస దాడులు విగ్రహ ధ్వంసం ల మీద ఆయన స్పందించే తీరు వ్యాఖ్యానించే తీరు ఇలా ఉండకూడదు…. రాష్ట్రంలో ఆలయాల మీద జరుగుతున్న వరుస దాడులు ముమ్మాటికీ రాజకీయ క్రీడ… ఇది ఎవరిని అడిగినా ఒప్పుకుంటారు. దీని వెనుక ఉన్న పెద్ద కుట్ర, పెద్ద వారి బుర్రలను బయటకు పెట్టాల్సిన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, దీన్ని ఎంతో చాకచక్యంగా చేయించాల్సిన సీఎం స్థాయి వ్యక్తి కేవలం దేవుడి మీద భారం వేసి, దేవుడి తో ఆడుకుంటున్న వారిని దేవుడు చూస్తాడు అంటూ మాట్లాడటం అంత హుందాగా లేదు. రాష్ట్రంలో ఏం జరిగినా దానికి బాధ్యత ప్రభుత్వానిదే. దానికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి దే. వరుసగా హిందూ ఆలయాలు మీద జరుగుతున్న దాడుల వెనుక ఏం జరుగుతుంది ఎవరు ఉన్నారు అనేది ముఖ్యమంత్రి స్థాయికి ఇప్పటికే పూర్తిగా అవగతం అయి ఉండాలి… దానికి ఎలా చెక్ పెట్టాలి అవతలివారు ఎత్తులకు పై ఎత్తులు ఎలా వేయాలి అన్నది ముఖ్యమంత్రి ఆలోచించాలి… అంతేతప్ప శాపనార్థాలు దేవుడి మీద భారం వేస్తే హిందూ ఆలయాలపై దాడులు ఇప్పట్లో ఆగవు.

ఇంటిలిజెన్స్ ఉందా??

రాష్ట్రంలో ఎలాంటి చిన్న విషయం జరిగినా ఇంటెలిజెన్స్ కు సమాచారం ఉంటుంది. జిల్లాస్థాయిలో స్పెషల్ బ్రాంచ్, ఇంటిలిజెన్స్, కౌంటింగ్ ఇంటిలిజెన్స్ విభాగాలన్నీ అక్కడ జరిగే విషయాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతాయి. దానిని ఎప్పటికప్పుడు పై అధికారులకు తెలియజేస్తారు. వీళ్ళందరికీ ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యత వహిస్తారు. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి తోనే సమాచారం పంచుకునే సౌలభ్యం ఉంటుంది. హోం మంత్రి కి సైతం ఇంటిలిజెన్స్ విభాగం మీద అజమాయిషీ ఉండదు. మరి రాష్ట్రంలో ఎం జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది అనే దాని మీద ఇంటిలిజెన్స్ కు సమాచారం లేదా? ఒకవేళ ఉన్న సీఎం స్థాయిలో జగన్ ముందుకు వెళ్ళడానికి ఉన్న ఇబ్బంది ఏమిటీ అన్నది ప్రశ్న. ఒకవేళ పెద్ద స్థాయి వ్యక్తులు దీనిలో ఉంటే పెరగడానికి వ్యూహం రచించి వారి ఎత్తులను చిత్తు చేయాల్సిన అవసరం సీఎంగా జగన్ మీద ఉంది.

కచ్చితంగా కుట్ర!!

హిందూ ఆలయాల మీద వరుస దాడులు సాధారణంగా జరగడం లేదు. దీని వెనుక పెద్ద కుట్ర, హిందుత్వ శ్రేణులను రెచ్చగొట్టే అతిపెద్ద స్ట్రాటజీ దాగి ఉంది. జగన్ క్రైస్తవుడు అనేది, ఆయన ప్రభుత్వం వచ్చాక ఏది హిందూ ఆలయాలు మీద దాడులు పెరిగాయి అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలని దీనిలో ప్రధాన వ్యూహం. ఇప్పటికే కులాల రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో అధికం. ఇప్పుడు వాటిలోకి మత రాజకీయాలలో చొప్పించి… పాగా వేయాలన్నది ఓ పార్టీ వ్యూహం. అంతర్వేది రథం తగలబడిన సమయంలోనే జగన్ సీబీఐకు కేసును ఇచ్చి తన మీదకు రాకుండా చూసుకున్నారు. అయితే సిబిఐ నివేదిక ఎన్ని రోజులైనా బయటికి రాదు రాబోదు.. ఇదే పద్ధతి ప్రతిసారి కుదరదు కాబట్టి… ఆలయాల మీద దాడులు, విగ్రహ ధ్వంసం జరుగుతూనే ఉన్నాయి. దీనిపై మొదట కుట్రదారులను బయటకు తీసుకు రావలసిన అవసరం ఉంది. అలాగే ఆలయాల విషయాల్లో వేగంగా స్పందించి… తగిన వ్యూహంతో ముందుకు వెళ్లకపోతే జగన్ ప్రభుత్వానికి హిందుత్వం వేసేందుకు ఓ ప్రత్యేకమైన ప్యాకేజీ ఢిల్లీ కేంద్రంగా సిద్ధమై ఉంది.

author avatar
Comrade CHE

Related posts

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

AP SSC Results: ఏపీలో టెన్త్ ఫలితాలు వచ్చేశాయోచ్ .. పార్వతీపురం మన్యం ఫస్ట్ .. కర్నూల్ లాస్ట్.. రిజల్ట్స్ ఇలా తెలుసుకోండి

sharma somaraju

కిష‌న్‌రెడ్డిని ద‌గ్గ‌రుండి మ‌రీ గెలిపిస్తోన్న కేసీఆర్, రేవంత్‌..!

2019కు రివ‌ర్స్‌లో… గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఆ నాలుగు ఎంపీ సీట్ల ఫ‌లితాలు…!

రాజమండ్రి సిటీలో వైసీపీ భ‌ర‌త్ Vs టీడీపీ వాసు… హీరో ఎవరో తేలిపోయిన‌ట్టే…?

రాజమండ్రి రూరల్ రిపోర్ట్‌: ‘ టీడీపీ బుచ్చయ్య ‘ గెలుస్తాడా…?