NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Wife Return to Home after Funerals: కరోనాతో చనిపోయింది..! కర్మకాండలు పూర్తి అయ్యాయి..! తాపీగా నేడు ఆమె ఇంటికి వచ్చింది..! అదేలానో చూడండి..!!

Wife Return to Home after Funerals: ఈ ఫోటోలో కనిపిస్తున్నామె పేరు ముత్యాల గిరిజమ్మ, కృష్ణాజిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని కొలిమిబజారు ఆమెది. గత నెల ఆమెకు కరోనా సోకింది. కుటుంబ సభ్యులు ఆమెను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే 15వ తేదీన ఆసుపత్రి నుండి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. గిరిజమ్మ చనిపోయింది. మృతదేహాం తీసుకువెళ్లండి అని. ఆమె కుటుంబ సభ్యులు వెళ్లి ఆసుపత్రి వర్గాలు ఇచ్చిన మృతదేహాన్ని తీసుకువచ్చి దహన సంస్కారాలు పూర్తి చేశారు.

Wife Return to Home after Funerals
Wife Return to Home after Funerals

Read More: warangal central jail: త్వరలో అదృశ్యం కానున్న 135 ఏళ్లనాటి వరంగల్లు సెంట్రల్ జైలు భవనం ఇదే..! స్టార్ట్ అయిన ఖైదీల తరలింపు..!!

గత నెల 25వ తేదీన ఆమె కుమారుడు రమేష్ కూడా కరోనాతో ఖమ్మం ఆసుపత్రిలో మృతి చెందాడు. రెండు రోజుల క్రితం గిరిజమ్మ, రమేష్ లకు కుటుంబ సభ్యులు దశదిశ కర్మలను పూర్తి చేశారు. భార్య, కుమారుడు చనిపోవడంతో గడ్డయ్య మానసిక ఆందోళనతో  కుంగిపోయాడు. అయితే వారికి బుధవారం ఊహించని ఘటన ఎదురైంది. గిరిజమ్మ తాపీగా ఆటో దిగి ఇంటికి వచ్చింది. దీంతో ఒక్కసారిగా అందరూ ఖంగుతిన్నారు. ఆమె కుటుంబ సభ్యులతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన వారు ఇది కలా, నిజమా అన్నట్లు నిర్ఘాంతపోయారు. 15 రోజుల క్రితం చనిపోయింది అనుకొని ఖర్మకాండలు పూర్తి అయిన ఆమె ఇంటికి రావడం ఏమిటని. తనకు కరోనా తగ్గిపోవడంతో ఆసుపత్రి వర్గాలు డిశ్చార్జ్ చేయడంతో ఇంటికి వచ్చానని గిరిజమ్మ చెప్పడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. గిరిజమ్మను చూసేందుకు చుట్టపక్కల వారంతా ఆమె ఇంటికి చేరుకుని పరామర్శించారు.

Wife Return to Home after Funerals
Wife Return to Home after Funerals

అయితే ఆసుపత్రి సిబ్బంది చేసిన నిర్వాకానికి మండిపడుతున్నారు. ఎవరు చనిపోయారో నిర్ధారించుకోకుండా మరొకరి శవాన్ని తమకు అప్పగించి మానసిక క్షోభకు గురి చేశారని ఆమె భర్త గడ్డయ్య మండిపడుతున్నారు. గిరిజమ్మ క్షేమంగా ఇంటికి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ కుమారుడు కరోనాతో చనిపోవడంతో దంపతులు ఇద్దరూ కంటతడి పెట్టుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్వాకాన్ని ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?