NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రాజమండ్రి సిటీలో వైసీపీ భ‌ర‌త్ Vs టీడీపీ వాసు… హీరో ఎవరో తేలిపోయిన‌ట్టే…?

రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో హీరో ఎవరు… విలన్ ఎవరు… ఇదే ప్రశ్న ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడ నుంచి సినీ నటుడు, సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్ వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తుండగా… టీడీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. దీంతో గెలిచిన వారు హీరో అని… ఓడిన వారు విలన్ అంటున్నారు స్థానికులు. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ హవాలో కూడా వైసీపీ ఓడిందంటే అందుకు కారణం… ఆదిరెడ్డి భవాని మాట తీరు. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు సొంత అక్క కావడం కూడా ఆమెకు కలిసి వచ్చిన అంశం.

అటు వైసీపీలో కూడా ఆదిరెడ్డి భవానికి మంచి పేరు ఉంది. ఎర్రన్నాయుడు కుమార్తె కావడంతో… సీనియర్లకు బాగా సుపరిచితమైన పేరు. అదే సమయంలో భవాని మామ ఆదిరెడ్డి అప్పారావు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా వ్యవహరించారు కూడా. ఆయనకు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయనేది బహిరంగ రహస్యం. ఇవన్నీ ఆదిరెడ్డి వర్గానికి అనుకూలించే అంశాలు. అయితే ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి నియోజకవర్గం పనులన్నీ కూడా భర్త ఆదిరెడ్డి వాసు చూసుకున్నారు.

పైగా రెండేళ్లుగా భవానీ పూర్తిగా హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు రాజమండ్రి వచ్చి వెళ్లే వారు. అటు ఆదిరెడ్డి అప్పారావు, వాసులపై చిట్‌ఫండ్ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు కూడా చేశారు. దాదాపు నెల రోజుల పాటు జైలు జీవితం గడిపారు. ఇదంతా ప్రభుత్వం చేసిన కుట్ర అని అప్పట్లో ప్రచారం చేశారు. ఇది కొంత సానుభూతి కలిగించిందనే చెప్పాలి. అయితే ఆదిరెడ్డి వాసు తీరు వల్ల ఇప్పటికే 15 మంది మాజీ కార్పొరేటర్లు పార్టీకి రాజీనామా చేశారు. ఇది కొంత ఇబ్బంది కలిగించే అంశం. వాసుపై గతంలో రూరల్ నియోజకవర్గం నేతలు కూడా చంద్రబాబుకు ఫిర్యాదులు చేశారు.

అయితే కింజరాపు అల్లుడు కావడంతో అతనిపై చర్యలు తీసుకోలేదనే మాట వినిపిస్తోంది. ఇటు వైసీపీలో మార్గాని భరత్‌కు ఎదురుగాలి వీస్తోంది. ఐదేళ్లు ఎంపీగా ఉన్న సమయంలో భరత్ చేసింది ఏమీ లేదనేది వాస్తవం. టీడీపీ నేతలపై వ్యాఖ్యలు చేయడం మినహా… నియోజకవర్గం అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదు. పైగా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు భరత్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇది భరత్ ఓటమికి ప్రధాన కారణం కూడా. తానోక సినిమా హీరో అని… తను నటించడం మొదలుపెడితే… మిగిలిన హీరోలకు మార్కెట్ ఉండదంటూ భరత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇవన్నీ కూడా భరత్‌ ఓటమికి కారణాలే.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?