TTD Board: టీటీడీ చైర్మన్ రేసులో ఈ పెద్దాయన కూడా ఉన్నారా..?అందుకు కారణం లేకపోలేదు..!!

TCP Key leaders in the race on the TTD Board
Share

TTD Board: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలకమండలి పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ గా టీటీడీ ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, కన్వీనర్ గా అదనపు ఈఓ ధర్మారెడ్డిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వారు గురువారం ప్రమాణ స్వీకార స్వీకారం చేశారు. రాజ్యసభ ఆశిస్తున్న వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ గా రెండవ టర్మ్ కొనసాగడానికి ఆసక్తి చూపలేదని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుంది ? ఎవరెవరు ఆశిస్తున్నారు? జగన్మోహనరెడ్డి ఎవరికి అవకాశం కల్పిస్తారు ? ఆయన మనసులో ఎవరు అన్నారు ? అనేది చర్చనీయాంశమవుతోంది.

YCP Key leaders in the race on the TTD Board
YCP Key leaders in the race on the TTD Board

Read More: Big Breaking: టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఏపి ప్రభుత్వం కీలక నిర్ణయం ఇదీ..!!

టీటీడీ చైర్మన్ పదవి రేసులో ప్రస్తుతం మాజీ ఎంపి మేకపాటి రాజమోహనరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పేర్లు వినబడుతుండగా వైసీపీలో కీలక నేతగా ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా చైర్మన్ రేసులో ఉన్నారా అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానం రావడానికి గల కారణాలు ఉన్నాయి. విజయసాయి రెడ్డి రాజ్యసభ పదవీ కాలం వచ్చే ఏడాది జూన్ లో ముగియనున్నది. వైవీ సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపాలంటే సామాజిక సమీకరణాల నేపథ్యంలో విజయసాయిరెడ్డిని ఆపాల్సి ఉంటుంది. దానికి తోడు విజయసాయి రెడ్డి గతంలో టీటీడీ బోర్డు డైరెక్టర్ గా రెండు టర్మ్ లు బాధ్యతలు నిర్వహించి ఉన్నారు. నూతన పాలకమండలి నియామకం చేయడానికి సుమారు నాలుగైదు నెలలు పట్టే అవకాశం ఉంది. ఇంత ఆలస్యం జరిగే అవకాశం ఉన్నందునే ప్రభుత్వం స్పెసిపైడ్ అథారిటీని నియమించి ఉండవచ్చు. టీటీడీలో డైరెక్టర్ లను ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని నియమిస్తున్నందున ఆయా రాష్ట్రాల నుండి నేతల ఎంపికకు సమయం పట్టే అవకాశం ఉంది.

Read More: AP CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ ‌ను సత్కరించిన వైసీపీ క్షత్రియ నేతలు..! ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!

తాజాగా నిన్న జరిగిన ఓ సంఘటన కూడా విజయసాయి రెడ్డి టీటీడీ చైర్మన్ పదవి ఆశిస్తున్నారేమో అన్న అనుమానం వచ్చేదిలా ఉందని అంటున్నారు.విజయసాయి రెడ్డి నిన్న ఢిల్లీలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఐటీ అప్పిల్లేట్ ట్రైబ్యునల్ సానుకూల ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వైజాగ్  మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ గతంలో చెల్లించిన రూ.219కోట్ల నిధులను వడ్డీతో కలిపి తిరిగి ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రిని విజయసాయి కోరారు. ఉత్తరాంధ్ర ఇన్ చార్జి బాధ్యతలు, విశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నందున విజయిసాయి ఈ విషయంలో చొరవ తీసుకున్నారని అనుకోవచ్చు. అయితే దీనితో పాటు టీటీడీకి సంబంధించిన పలు ప్రధాన సమస్యలను కూడా కేంద్ర ఆర్థిక మంత్రితో విజయసాయి చర్చించడం గమనార్హం.

టీటీడీకి జీఎస్టీ నుండి మినహాయింపు ఇవ్వాలని కోరడంతో పాటు ప్రవాస భారతీయ భక్తులు (ఎన్ఆర్ఐ) అందించే విరాళాల స్వీకరణకు వీలు కల్పించే ఎఫ్‌సీఆర్ఏ ధరఖాస్తు పునరుద్దరణపైనా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో విజయసాయి రెడ్డి చర్చించారు. గతంలో టీటీడీ పాలకమండలిలో డైరెక్టర్ గా చేసిన అనుభవం ఉండటంతో పాటు ఆ అంశాలపై ప్రస్తుతం కేంద్ర మంత్రి వద్ద విజయసాయి చర్చించి, తను కూడా టీటీడీ  చైర్మన్ రేసులో ఉన్నానని పరోక్షంగా సంకేతం ఇచ్చారా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సి ఉంటుంది.


Share

Related posts

సల్మాన్ సోదరి చేసిన పనికి షాక్ అవుతారు..! రెస్టారెంట్ లో ప్లేట్లు విసిరికొట్టింది..!!

Vissu

Chintamaneni: ఏపీ డీజీపీ పై సీరియస్ కామెంట్స్ చేసిన చింతమనేని..!!

sekhar

ప్రియురాలి సమాధి వద్దే ప్రాణం తీసుకున్న ప్రియుడు!

Teja