NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Gun fired: కడప జిల్లాలో కాల్పుల కలకలం…సోదరుడిని తుపాకీతో కాల్చి..ఆపై తాను..

Gun fired: ఓ వైసీపీ నేత తన లైసెన్సు రివాల్వర్‌ తో తన సోదరుడిని కాల్చి ఆపై అతను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడప జిల్లాలో జరిగింది. పెనగలూరు మండలం నల్లపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నేత  శివ ప్రసాదరెడ్డి తన లైసెన్డ్ తుపాకీతో పార్థసారధి రెడ్డిని కాల్చి చంపారు. అనంతరం తనకు తాను కాల్చుకుని శివ ప్రసాదరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.

Ycp Leader Gun fired at Penagaluru mandal in kadapa dist
Ycp Leader Gun fired at Penagaluru mandal in kadapa dist

ఆస్తి విషయంలో వివాదాలే ఇద్దరి మధ్య గొడవలకు కారణమని గ్రామస్తులు పేర్కొంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదశ్చాయలు అలుముకున్నాయి. ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

ఆస్తి వివాదాల నేపథ్యంలో తొలుత పార్ధసారధి రెడ్డి గొడ్డలిలో శివప్రసాదరెడ్డిపై దాడికి వెళ్లడంతో ఆయన ఆత్మరక్షణ కోసం లైసెన్డ్ గన్ తో ఫైర్ చేశారనీ, ఆ తరువాత సోదరుడిని చంపేశాను అన్న మనస్థాపంతో శివప్రసాదరెడ్డి కూడా తనకు తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం.

కాగా ఈ వార్తను పులివెందుల మండలంలో జరిగినట్లు ప్రధాన మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. అయితే పులివెందుల మండలంలో నల్లపురెడ్డిపల్లె అనే గ్రామం లేదు. నల్లపురెడ్డిపల్లె గ్రామం పులివెందుల సమీపంలోని పెనగలూరు మండల పరిధిలో ఉంది. ఇది కోడూరు నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. కానీ ప్రధాన మీడియా సంస్థలతో పాటు సోషల్ మీడియాలోనూ పులివెందుల మండలంలో ఘటన జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. పులివెందుల మండలానికి నల్లపురెడ్డిపల్లి గ్రామానికి సంబంధం లేదు. సోదరుడిపై కాల్పులు జరిపి తనకు తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత శివప్రసాదరెడ్డి పెనగలూరు మండల పరిషత్ అధ్యక్షుడి రేసులో ఉన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju