Talupula (Anantapur): తలపుల మండలం బండ్లపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న ఓబులేశ్వర స్వామిని ఆదివారం వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ బత్తలహరి ప్రసాద్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఆలయ అభివృద్ధి పనుల కోసం డాక్టర్ బత్తలహరి ప్రసాద్ లక్ష రూపాయల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.

అనంతరం ఆయనును ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర సీఈసీ సభ్యులు పూల శ్రీనివాస్ రెడ్డి, బత్తుల వెంకట రమణ, కదిరి పట్టణ వైసీపీ అధ్యక్షుడు బహుద్దీన్, లింగాల లోకేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.