Subscribe for notification

TDP: ఆ వైసీపీ ఎమ్మెల్యే కుమార్తె నారా లోకేష్ ను కలిసినా, టీడీపీ చేరినా వీళ్లకు లాభమేంది..? వాళ్లకు వచ్చే నష్టమేందప్పా..?

Share

TDP: నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్యా రెడ్డి ఒంగోలులో మహానాడు జరుగుతున్న సందర్భంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను కలిశారు. బొకే అందజేశారు. శుభాకాంక్షలు తెలియజేశారు. కైవల్యారెడ్డి తన భర్త రితేష్ రెడ్డితో లోకేష్ ను కలిశారు. ఇక్కడ పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఎందుకంటే.. కైవల్యారెడ్డి.. వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామానారాయణ రెడ్డి కుమార్తె అయినా ఆమె బద్వెల్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కోడలు. కైవల్యారెడ్డి భర్త రితేష్ రెడ్డి బద్వెల్ నియోజకవర్గంలో టీడీపీ నాయకుడుగా కొనసాగుతున్నారు.

YCP MLA anam ramanarayana reddy daughter meet TDP leader nara lokesh

TDP: టీడీపీ మాజీ ఎమ్మెల్యే కోడలు

అయితే కైవల్యారెడ్డి తన భర్తతో కలిసి మహానాడులో పాల్గొని నారా లోకేష్ ను కలవడంతో ఇదే హైలెట్ వార్త అన్నట్లుగా టీడీపీ అనుకూల మీడియాలో వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కుమార్తె టీడీపీలోకి చేరనున్నారంటూ స్ర్కోలింగ్ ఇవ్వడం మొదలు పెట్టారు. వాస్తవానికి కైవల్యారెడ్డి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చినా ఇప్పటి వరకూ రాజకీయంగా యాక్టివ్ గా లేరు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కోడలు, టీడీపీ నేత సతీమణిగానే కౌవల్యారెడ్డి నారా లోకేష్ ను కలిశారు. కౌవల్యారెడ్డి తండ్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి వర్గ విస్తరణకు ముందు కొంత ఆసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చినా ఆ జిల్లా నుండి కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీలో యాక్టివ్ గానే ఉన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో వైసీీపీ పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూ పార్టీ మారనున్నారు అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టేశారు రామనారాయరెడ్డి.

ఆత్మకూరు పై దృష్టి

అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే..?బద్వెల్ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం కావడం వల్ల రితేష్ రెడ్డి పార్టీ కోసం ఎంత పని చేసినా పోటీ చేసే అవకాశం లేదు. అందుకే జరగబోయే ఎన్నికల్లో ఆనం రామనారాయణ రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించి ఆత్మకూరు నియోజకవర్గం నుండి ఆయన కుమార్తె, తన భార్య కైవల్యారెడ్డిని టీడీపీ తరపున బరిలో దింపేందుకే యాక్టివ్ రాజకీయాల్లోకి రితేష్ రెడ్డి తీసుకువస్తున్నారని అంతర్గతంగా నడుస్తున్న టాక్. ఆత్మకూరు నియోజకవర్గాన్ని వీరికి హామీ ఇస్తారో..? లేదో వేచి చూడాలి. ప్రస్తుతం ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నిక జరగనున్నప్పటికీ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబ నుండే వైసీపీ అభ్యర్ధిని నిలుపుతున్నందున గత సంప్రదాయం ప్రకారం టీడీపీ పోటీ పెట్టకుండా ఉంటుందా..? లేక పోటీ పెడుతుందా ..? అనేది సస్పెన్స్ యే.


Share
somaraju sharma

Recent Posts

Mango: మామిడి పండ్లు తిన్న వెంటనే వీటిని తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే.!?

Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…

40 mins ago

Hero Ram: ప్రియురాలితో పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రామ్‌!

Hero Ram: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…

40 mins ago

AP Employees: జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము మాయంపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారిని కలిసిన ఏపి ఉద్యోగ సంఘాల నేతలు… అసలు విషయం ఇదీ

AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…

52 mins ago

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

2 hours ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

2 hours ago

Pain Killer: ఒక్క గ్లాస్ ఈ డ్రింక్ తాగితే అన్నిరకాల శారీరక నొప్పులు ఫటాఫట్..!

Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…

3 hours ago