Subscribe for notification

YCP MLA: ఆ ప్రభుత్వ పథకంపై అధికార పార్టీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్

Share

YCP MLA: ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే నిత్యం ప్రజల్లో ఉంటారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా తెలుసుకుంటూ ఉంటారు. సమస్యలపై అక్కడికక్కడే అధికారులకు అక్షింతలు, ఆదేశాలు జారీ చేస్తుంటారు. అటువంటి ఎమ్మెల్యే తాజాగా ప్రభుత్వ పథకంపై సంచలన కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. చిన్న సన్నకారు రైతుల ఉపయోగార్ధం ప్రభుత్వం జలకళ పథకాన్ని ప్రవేశం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ప్రభుత్వం సొంత ఖర్చులతో బోరు బావులు వేస్తుంది.

YCP MLA Ketireddy Venkatramireddy sensational comments on jalakala

YCP MLA: ఈ పథకమే తప్పు

అయితే ఈ పథకంలో కొన్ని లోపాలు ఉన్నాయి. రెండున్నర ఎకరాలు ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు. ఒకే రైతుకు అంత భూమి లేకపోతే ఇద్దరు ముగ్గురు రైతులు గ్రూపుగా ఏర్పడి ఈ పథకం కింద లబ్ది పొందవచ్చు. అయితే నీరు పడినా పడకపోయినా నిర్దేశించిన అడుగులు మాత్రమే బోరు వేస్తారు. దీంతో ఈ పథకం వల్ల ఎక్కువ మంది లబ్దిపొందలేకపోతున్నారు. ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో సత్యసాయి జిల్లా ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి జలకళ పథకమే తప్పని వ్యాఖ్యానించడం సంచలన అంశం అయ్యింది. ధర్మవరం మండలం సుబ్బారావుపేటలో ఆయన గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో రైతులతో మాట్లాడారు.

Read more: YCP MLC Anantababu: సీఎం వైఎస్ జగన్ సీరియస్ ఆదేశాలు .. వైసీపీ ఎమ్మెల్సీ ఆనం బాబు అరెస్టుకు రంగం సిద్దం చేసిన పోలీసులు

ఈ సందర్భంలో మల్లీశ్వరి అనే మహిళా రైతు జలకళ బోరు సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు,. తమ వ్యవసాయ భూమిలో జలకళ పథకం కింద బోరు వేశారనీ, కానీ ఇప్పటి వరకూ విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదని ఎమ్మెల్యేకు తెలియజేశారు. దీనిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ అసలు ఈ పథకం కింద ఎంత మందికి బోర్లు వేయాలి, ఎంత లోతు వేయాలి అనేది తమకే అర్ధం కావడం లేదని అన్నారు. అసలు ఈ పథకమే తప్పని అన్నారు. ఒకరికి బోరు వేసి ఒకరికి వేయలేని దుస్థితి తలెత్తుతోందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడటంతో అక్కడ ఉన్న వారు ఆశ్చర్యానికి గురైయ్యారు.


Share
somaraju sharma

Recent Posts

Virata Parvam-Vikram: ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `విక్ర‌మ్‌`, `విరాట ప‌ర్వం`..ఇవిగో స్ట్రీమింగ్ డేట్స్‌!

Virata Parvam-Vikram: క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత ఓటీటీల హ‌వా ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం థియేట‌ర్స్‌లో…

20 mins ago

Mango: మామిడి పండ్లు తిన్న వెంటనే వీటిని తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే.!?

Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…

1 hour ago

Hero Ram: ప్రియురాలితో పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రామ్‌!

Hero Ram: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…

1 hour ago

AP Employees: జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము మాయంపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారిని కలిసిన ఏపి ఉద్యోగ సంఘాల నేతలు… అసలు విషయం ఇదీ

AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…

2 hours ago

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

2 hours ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

3 hours ago