ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

నెల్లూరు ఎస్‌పి పై వై‌సీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఫైర్….!!

Share

ఆయన ఓ అధికార పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, ఏమి మాట్లాడినా ఎవరు ఏమి చేయలేరు. అదే ఆయన ధీమా. దిగువ స్థాయి అధికారులకు భుజం కాస్తూ ఏకంగా ఎస్పీ పైనే తీవ్ర స్థాయిలో ఏకవచన సంబోధంతో విరుచుకుపడ్డారు. ఆయన ఎవరో కాదు నెల్లూరు జిల్లా కొవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. ఓ జిల్లా స్థాయి పోలీస్ అధికారిని ఆ విధంగా వేరే ఎవరైనా దుర్భాషలాడితే వెంటనే పోలీసు అధికారుల సంఘ నేతలు స్పందించే వారు, కేసులు పెట్టేవారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించే వారు. నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ను ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి.

నెల్లూరు ఎస్‌పి పై వై‌సీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఫైర్....!!
ycp mla Prasanna Kumar reddy fires on Nellore sp

ప్రసన్న కుమార్ రెడ్డి మాటల్లోనే.. “వాడికి ఒళ్లు బలిసి మా నాయకుడు మీద సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు, యాక్షన్ తీసుకోవాలా? లేదా? ఒపెన్ గానే చెప్పేస్తున్నా, నీవు తెలుగుదేశం పార్టీకి ఏజంటువా, మా ప్రభుత్వం తరపున ఈ జిల్లాకు అధికారిగా వచ్చిన వ్యక్తివా? ఇంతకన్నా నేను ఏమి చెప్పను, ఇది చాలు నీకు. ఏవడో తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి ఫోన్ చేస్తే నేవ్వేందయ్యా మా వాళ్లకు ఫోన్ చేసి కేసులు రిజిస్టర్ చేయవద్దు అనేది, నీవు ఎన్ని రోజులు ఉంటావు నెల్లూరు జిల్లాలో, రెండు రోజులు ఉంటావో, మూడు రోజులు ఉంటావో తరువాత నీ బతుకేంది, వేరే జిల్లాకు పోతావు, నీవు ఎవడు అసలు, ఎస్సీ, ఎస్టీ కేసులు రిజిస్టర్ చేయవద్దని చెప్పడానికి నీకు ఏమి రూల్స్ ఉన్నాయి, ఏ జిల్లాలో ఈ విధంగా జరగడం లేదే, మా నెల్లూరు జిల్లాలో కూడా ఈ విధంగా ఎప్పుడూ జరగలేదు.

ఎస్సీ, ఎస్టీ కేసులు రిజిస్టర్ చేసేవాళ్లు, తరువాత ఎంక్వైరీ చేసేవాళ్లు, దానిలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా డిపార్ట్ మెంట్ యాక్షన్ తీసుకుంటుంది. బెదిరిస్తావా.. జైళ్లలో వేయిస్తా అన్నాడంట కింద డిపార్ట్ మెంట్ వాళ్లను, నీకు ఉందా ఆ దమ్ము, నేను నిలబడతా మా వాళ్ల పక్కన, మా ఎస్ఐ పక్కన, మా సీఐ పక్కన, మా డీఎస్పీ పక్కన నేను నిలబడతా.. రా.. నీకు దమ్ముంటే వచ్చి అరెస్టు చేయి వాళ్ల ముగ్గురిని, న్యాయం పక్కన నేను ఉంటా, నీ లాగా పిచ్చి వ్యవహారాలు నేను చేయను, ఏమి భయం నీకు, తెలుగు దేశం వాళ్లు ఫోన్ చేస్తే నీవేంది బెదిరిపోయేది. ఎవరి గవర్నమెంట్ అనుకుంటున్నావు, జాగ్రత్తగా ఉండమని చెపుతున్నా, నాతో పెట్టుకోవద్దని చెబుతున్నా” అంటూ పరోక్షంగా జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశారు ప్రసన్నకుమార్ రెడ్డి.

అసలు విషయం ఏమిటంటే.. డీసిఎంఎస్ చైర్మన్ చలపతిరావు పై కొందరు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారు. ఆ పోస్టులు పెట్టింది టీడీపీ నేతలే అని వైసీపీ నేతల ఆరోపణ. పోస్టులు పెట్టిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసులు పెట్టాలన్నది వీరి డిమాండ్. స్థానికంగా ఉన్న ఎస్ఐ, సీఐ, డీఎస్పీలు ఇక్కడి వైసీపీ నాయకులు చెప్పినట్లు విని కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా జిల్లా ఎస్పీ కేసులు పెట్టవద్దంటూ దిగువ స్థాయి అధికారులకు చెప్పడంతో వీరు ఈ విషయాన్ని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డికి తెలిపారు. టీడీపీ మాజీ మంత్రి ఒకరు జిల్లా ఎస్పీకి చెప్పడం వల్లనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం లేదని అభియోగం. ఎస్పీపై ప్రసన్న కుమార్ రెడ్డికి తీవ్ర ఆగ్రహం రావడానికి ఇది ఒక కారణం.

మరో విషయం ఏమిటంటే నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య సమన్వయం లేదన్న మాట కూడా వినిపిస్తోంది. జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఈ జిల్లాకు చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాలనే ఎక్కువగా పాటిస్తూ ఇతర అధికార పార్టీ నేతలకు అంతగా పట్టించుకోవడం లేదన్నది టాక్. దీనిపై జిల్లా ఎస్పీ, పోలీస్ సంఘాల నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. అయితే ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యల దుమారం రాజకీయ వర్గాల్లో, సామాన్య ప్రజానీకంలోనూ తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

గతంలో గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆమె నియోజకవర్గ సీఐపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడిన విషయం తెలిసిందే. అప్పుడు ఆడియో టేపు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ఎమ్మెల్యే సీఐపై విరుచుకుపడగా సీనియర్ ఎమ్మెల్యే అయిన  ప్రసన్నకుమార్ రెడ్డి ఏకంగా ఎస్పీపైనే వ్యాఖ్యలు చేయడం విశేషం.

 

ఇది కూడా చదవండి..ఇవాల్టికి ఇదే హై లైట్ న్యూస్ : భోరున ఏడ్చిన రోజా – చలించిపోయిన జగన్ ?

 

 

 


Share

Related posts

AP Capital: విద్యాశాఖలోనూ కన్ఫ్యూజన్.. ఏపికి రాజధాని పేరు లేకుండానే భారతదేశ పటం..

somaraju sharma

Mirnaa Beautiful Pictures

Gallery Desk

Jyothula Nehru : బ్రేకింగ్.. టిడిపి ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన జ్యోతుల నెహ్రూ..

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar