NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YCP MLA RK Roja: ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థపై ఎమ్మెల్యే రోజాతో సహా ప్రయాణీకులు ఫైర్..! ఎందుకంటే..?

YCP MLA RK Roja: ఇండిగో విమాన సంస్థపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజాతో సహా పలువురు ప్రయాణీకులు ఫైర్ అయ్యారు. ఈ రోజు రాజమండ్రి నుండి తిరుపతి బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. తిరుపతి ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ సాధ్యం కాకపోవడంతో దాదాపు గంట పాటు గాలిలో చక్కర్లు కొట్టింది. ఆ తరువాత విమానాన్ని తిరిగి బెంగళూరు ఎయిర్ పోర్టులో లాండ్ అయ్యింది. ఈ విమానంలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు తదితర విఐపీలు ఉన్నారు. అయితే వాతావరణ సమస్యా లేక సాంకేతిక సమస్య అనే విషయంపై సిబ్బంది స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రయాణీకులు ఆందోళన చెందారు. ఇండిగో సిబ్బంది సమాధానంపై ప్రయాణీకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

YCP MLA RK Roja fires on indigo airlines
YCP MLA RK Roja fires on indigo airlines

 

YCP MLA RK Roja: సాంకేతిక సమస్యతో గంట పాటు గాలిలో చక్కర్లు

ఈ సందర్భంలో రోజా మీడియాతో ఫోన్ లో మాట్లాడారు. తాను ప్రయాణిస్తున్న ఇండిగో విమానం సాంకేతిక లోపం కారణంగా బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్ చేశారని తెలిపారు. కానీ అక్కడ అనుమతి ఉందో లేదో తెలియదని తెలిపారు. డోర్లు కూడా ఓపెన్ చేయలేదని రోజా అన్నారు. ఆకాశంలో మేఘాలు ఎక్కువగా ఉండటం వల్ల స్వల్పంగా విమానం ఊగినట్లు తెలిపారు. సాంకేతిక లోపం ఉన్నందున బెంగళూరు ఎయిర్ పోర్టు వరకు తీసుకువచ్చామని సిబ్బంది చెప్పారని రోజా అన్నారు. బెంగళూరు వరకూ తీసుకువచ్చారంటే ఏదో మేజర్ సమస్య ఉన్నట్లు కనిపిస్తోందని తెలిపారు. సాంకేతిక సిబ్బంది పరిశీలించిన అనంతరం విమానం నుండి ప్రయాణీకులను పంపిస్తామని తెలిపినట్లు చెప్పారు. మళ్లీ విమానం తిరుపతి వెళుతుందని చెబుతున్నారనీ, కానీ ఎంత సమయం పడుతుందో స్పష్టంగా చెప్పడం లేదని ఎమ్మెల్యే రోజా తెలిపారు. అయితే విమానంలో ఉన్న ప్రయాణీకులు తమను కిందకు దింపాలని కోరుతున్నా తమకు భద్రతాపరమైన అనుమతులు వస్తే దింపుతామని సిబ్బంది చెప్పారన్నారు.

ఇండిగోపై కేసు వేస్తా

బెంగళూరులో ప్రయాణీకులు దిగేందుకు ఇండిగో సిబ్బంది అదనంగా రూ.5వేలు రుసుము డిమాండ్ చేశారు. అయితే యాజమాన్యం తప్పిదానికి తామెందుకు డబ్బులు చెల్లించాలంటూ విమాన సిబ్బందిపై ప్రయాణీకులు ఫైర్ అయ్యారు. అనంతరం బెంగళూరు నుండి గమ్య స్థానాలకు చేరేందుకు ప్రయాణీకులు సొంత ఏర్పాట్లు చేసుకున్నారు. రెండు గంటల పాటు తమకు ఏమి సమాచారం చెప్పకుండా ఆందోళనకు గురి చేసిన  ఇండిగోపై కేసు వేస్తామని ఎమ్మెల్యే రోజా తెలిపారు. తరచు జరుగుతున్న విమాన ప్రమాదాలతో విమాన ప్రయాణం అంటే ఆందోళన చెందుతున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju