NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YCP MLA: అసెంబ్లీకి బయలుదేరిన ఎమ్మెల్యేకి షాకింగ్ న్యూస్ .. మార్గమధ్య నుండే తిరిగి వెనక్కు.. ఎందుకంటే..?

YCP MLA: ఏపిలో కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. 20 వేలకు పైగా నమోదు అవుతున్నాయి. అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటూ కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నా పలువురు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే అనేక మంది ప్రజా ప్రతినిధులు, నాయకులు కరోనా బారిన పడి కోలుకున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేకి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గురువారం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రొటోకాల్ ప్రకారం నెగిటివ్ రిపోర్టు వచ్చిన ప్రజా ప్రతినిధులు మాత్రమే హజరుకావాల్సి ఉంటుంది. దీంతో ముందుగానే మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు   కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

YCP MLA vara prasad tested covid 19 positive
YCP MLA vara prasad tested covid 19 positive

నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అయితే ఈ విషయం తెలియని ఆ ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశంలో పాల్గొనేందుకు అమరావతికి బయలుదేరారు. తీరా ఆయన గుంటూరు సమీపానికి వచ్చే సరికి సచివాలయ సిబ్బంది నుండి ఫోన్ ద్వారా సమాచారం అందింది. కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిపారు. దీంతో ఆయన అక్కడ నుండే వెనుతిరిగారు. హోం క్వారంటైన్ అయ్యేందుకు చెన్నై వెళ్లిపోయారు.

మరో పక్క అధికార పార్టీ ప్రజా ప్రతినిధులే కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని టీడీపీ విమర్శిస్తుంది. గురువారం అసెంబ్లీ సమావేశంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డితో సహా పలువురు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాస్కులు ధరించకుండా హజరయ్యారు. మాస్క్ ధరించకుండా సీఎం జగన్ ఇతర ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హజరైన ఫోటోలను టీడీపీ నేత నారా లోకేష్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విమర్శలు గుప్పించారు.  ముఖ్యమంత్రే మూర్ఖంగా మాస్క్ పెట్టుకోకపోతే ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు మాస్కులు ఎందుకు ధరిస్తారని ప్రశ్నించారు. మాస్క్ ధరించడం తప్పనిసరి అంటూ కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చిన మీరు మాస్క్  ధరించకుండా ప్రజలకు ఏమి సంకేతాలు ఇస్తున్నారని లోకేష్ ప్రశ్నించారు.

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju