YCP MLC: వైసీపీ ఎమ్మెల్సీ ఉదయ్ బాబు కారు డ్రైవర్ అనుమానాస్పద మృతి ..మేటర్ ఏమిటంటే..?

Share

YCP MLC: వైసీపీ ఎమ్మెల్సీ ఆనంత ఉదయ్ బాస్కర్ బాబు కారు డ్రైవర్ సుబ్రమణ్యం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సుబ్రమణ్యం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ తన కారులో అతని మృతదేహాన్ని కాకినాడలోని అతని ఇంటి వద్దకు పంపారు. అయితే సుబ్రమణ్యం మృతిపై అతని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. దీంతో సుబ్రమణ్యం తల్లిదండ్రులు పని చేస్తే అట్ మెంట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

YCP MLC Car Driver suspicious Death kakinada
  • NEWSORBIT నుండి తాజా వార్తలను చదవండి
  • facebook  ,  Twitter ,   instagram   మరియు   Googlenews  లో మమ్మల్ని అనుసరించండి

పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితులను అదుపులోకి తీసుకున్నారు. మృతుడి బంధువులతో మాట్లాడారు. అనంతరం సుబ్రమణ్యం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ జనరల్ ఆసుపత్రికి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కొన్నాళ్ల క్రితం సుబ్రమణ్యం తన వద్ద రూ.70వేలు తీసుకున్నట్లు ఉదయ్ బాబు ఫోనే చేసి చెప్పారని మృతుడి తల్లి. అందులో రూ.50వేలు తిరిగి ఇచ్చేశాడనీ, ఇంకో రూ.20వేల కోసం మళ్లీమళ్లీ ఫోన్ చేసే వాడని తెలిపింది.

ఈ ఘటనపై ఎమ్మెల్సీ ఆనంద ఉదయ్ భాస్కర్ వివరణ ఇచ్చారు. సుబ్రమణ్యం తన వద్ద అయిదేళ్లుగా డ్రైవర్ గా పని చేస్తున్నాడనీ, రెండు నెలలుగా సరిగా పనికి రావడం లేదు. సుబ్రమణ్యంకు మద్యం అలవాటు ఉందని, దీంతో ద్విచక్ర వాహనంపై అనేక మార్లు ప్రమాదానికి గురైయ్యాడని చెప్పారు. నిన్న రాత్రి సుబ్రమణ్యం రోడ్డు ప్రమాదానికి గురైనట్లు చెప్పారు. దీంతో రోడ్డు ప్రమాదంలో అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి సుబ్రమణ్యంను కాకినాడలోని అమృత ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అక్కడకు సుబ్రమణ్యం తల్లిదండ్రులు కూడా వచ్చారని చెప్పారు. ఆసుపత్రిలో సుబ్రమణ్యం చనిపోవడంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువెళ్లామని చెప్పారనీ, దాంతో అతని మృతదేహాన్ని కారులో అపార్ట్ మెంట్ వద్దకు పంపించానని ఎమ్మెల్సీ ఆనంద్ భాస్కర్ బాబు వివరణ ఇచ్చారు.


Share

Recent Posts

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

31 mins ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

55 mins ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

2 hours ago

సినీ ఎంట్రీ విషయంలో తల్లి శ్రీదేవి అప్పటి రియాక్షన్ తెలియజేసిన జాన్వి కపూర్..!!

దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…

2 hours ago

ఆగస్టు 9 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 9 – శ్రావణమాసం - మంగళవారం మేషం చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి వృథాఖర్చులు పెరుగుతాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. విద్యార్థుల…

4 hours ago

ఆ హిట్ మూవీని మిస్ చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఫీల‌వుతున్న ఫ్యాన్స్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జాగ‌న్నాథ్ తెర‌కెక్కించిన…

5 hours ago