25.2 C
Hyderabad
January 31, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆభియోగాలపై మరో సారి స్పందించిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. నార్త్ కుట్ర అంటూ సంచలన కామెంట్స్..

Share

ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతూనే ఉంది. ఈ కేసులో ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తున్న క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నేతల పేర్లు తెరపైకి వస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా ఈడీ ఢిల్లీలోని ప్రముఖ వ్యాపారి అమిత్ అరోరాను అరెస్టు చేసి సీబీఐ ప్రత్యేక కోర్టుకు హజరుపర్చిన సందర్భంలో కీలక విషయాలను రిమాండ్ రిపోర్టులో ప్రస్థావించింది. సౌత్ గ్రూప్ ను అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డి, కల్వకుంట్ల కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి నియంత్రించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. తాజాగా ఈ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లు రావడంతో వీరు వేరువేరుగా స్పందించారు. ఈ అంశంపై కవిత స్పందిస్తూ కేంద్రంలో బీజేపీ, ప్రధాని మోడీల రాజకీయ కుట్రలో భాగమని, కేసులు, విచారణలకు భయపడమని పేర్కొన్నారు.

Magunta Srinivasulu Reddy

 

వైసీపీ ఎంపీ శ్రీనివాసులు రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇంతకు ముందు సెప్టెంబర్ నెలలోనే తమకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో సంబంధం లేదని వివరణ ఇవ్వడం జరిగింది అంటూనే ఈ సారి సంచలన కామెంట్స్ చేశారు. తనకు, తన కుమారుడికి దానిలో భాగస్వామ్యం గానీ, ఆ కంపెనీల్లో షేర్లు గానీ లేవని తెలియజేశారు. లిక్కర్ స్కామ్ పేరుతో సౌత్ ఇండియా వ్యాపారులపై నార్త్ ఇండియా చేస్తున్న కుట్రగా ఆయన అభివర్ణించారు. ఆ కుట్రలో భాగంగానే ఈడీ తమ పేర్లను చేర్చిందని ఆరోపించారు. ఈ కేసులో ఈడీ అరెస్టు చేసిన ఆరారోతో తాను గానీ, తన కుమారుడు గానీ ఏనాడు మాట్లాడలేదని పేర్కొన్నారు. తమపై జరిగిన కుట్రలో అన్ని నిజాలు త్వరలో బయటకు వస్తాయని మాగుంట అన్నారు. పూర్తి వివరాలను త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడిస్తానని తెలిపారు. ఆ ఆరోపణలు అన్నీ కూడా నార్త్ వ్యాపారుల కుట్రగానే ఆయన ఆరోపించారు. తమ కుటుంబం 70సంవత్సరాలుగా నిజాయితీగా వ్యాపారం చేస్తొందని, అన్నారు మాగుంట.

Enforsment directorate

ఢిల్లీ లిక్కర్ స్కామ్ అభియోగాలపై టీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత స్పందన ఇది..


Share

Related posts

Panchayat Polls : చివరి విడత ఎన్నికల్లోనూ వైసీపీదే హవా…పలు గ్రామాల్లో నేతలకు పరాభవాలు

somaraju sharma

Water : మూలిగే నక్కపై జల పడగ! తెలుగు రాష్ట్రాలకు కొత్త సమస్య!

Comrade CHE

గెలిచేసిన బైడెన్..! ట్రంప్ ఆశలు గల్లంతు..!!

somaraju sharma