ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YCP MP RRR: వైసీపీకి బిగ్ షాక్ .. రెబల్ ఎంపీ రఘుురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు లేనట్టే(గా)..?

Share

YCP MP RRR: వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంంరాజుపై అనర్హత వేటు వేసి ఆ తరువాత పార్టీ నుండి సస్పెండ్ చేయాలన్న ఆ పార్టీ నేతల ఆశలకు స్పీకర్ కార్యాలయం నీళ్లు చల్లింది. దాదాపు రెండు సంవత్సరాలకు పైగా రఘురామ కృష్ణంరాజు సొంత పార్టీ నేతలపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపైనా, రాష్ట్ర ప్రభుత్వం పైనా విమర్శలు, ఆరోపణల దాడి కొనసాగిస్తున్నారు. వైసీపీకి కొరకరాని కొయ్యగా మారిన రఘురామ కృష్ణంరాజు పై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ ఎంపీలు పలు మార్లు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేయడంతో పాటు పార్టీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన పలు సాక్షాలను అందజేశారు. లోక్ సభ స్పీకర్ వద్ద రఘురామ కృష్ణంరాజు పై అనర్హత వేటు పిటిషన్ తో పాటు టీఎంసీకి చెందిన ఇద్దరు ఎంపీల అనర్హత పిటిషన్ లు పెండింగ్ లో ఉన్నాయి. ఇద్దరు టీఎంసీ ఎంపీలు బీజేపీకి మద్దతు పలికారు. వీరందరికీ లోక్ సభ స్పీ కర్ నోటీసులు జారీ చేసి వివరణలు తీసుకున్నారు.

YCP MP Raghu Rama Krishnam Raju in safe zone
YCP MP Raghu Rama Krishnam Raju in safe zone

YCP MP RRR: సభ్యుల అనర్హతపై ఇది క్లారిటీ

అయితే సభ్యుల అనర్హతకు సంబంధించి స్పీకర్ కార్యాలయం నిన్న ఇచ్చిన క్లారిటీతో రఘురామ కృష్ణంరాజు పై ఇప్పట్లో అనర్హత వేటు వేసే అవకాశం లేదని తేలిపోయింది. ఎందుకంటే.. ఏ సభ్యుడైనా పార్టీ జారీ చేసిన విప్ ఉల్లంఘించినప్పుడే అనర్హత నిబంధనలు వర్తిస్తాయి తప్ప కేవలం పార్టీ ముఖ్యమంత్రి, ఇతర నేతలపై విమర్శలు చేసినంత మాత్రాన కాదని లోక్ సభ స్వీకర్ కార్యాలయ వర్గాలు వ్యాఖ్యానించాయి. సభ్యుల అనర్హత కోసం వచ్చిన పిటిషన్ లు సభా హక్కుల సంఘం ముందు ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకూ రెండు సమావేశాలు జరిగాయనీ, నిబంధనల ప్రకారం వాటిపై విచారణ చేపట్టే హక్కుల సంఘం తగిన సిఫార్సులు చేస్తుందని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు లోక్ సభ కార్యాలయ అధికారి వెల్లడించారు.

సేఫ్ జోన్ లోనే ఆర్ ఆర్ ఆర్

వాస్తవానికి ఈ మూడేళ్ల కాలంలో రఘురామ కృష్ణంరాజు లోక్ సభలో విప్ దిక్కరించిన దాఖలాలు లేవు. ఈ లెక్కన రఘురామ కృష్ణంరాజు పార్టీని, ప్రభుత్వాన్ని దిక్కరిస్తూ వ్యవహరిస్తున్నా సేఫ్ జోన్ లోనే ఉన్నట్లు కనబడుతోంది. రఘురామ కృష్ణంరాజు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సఖ్యతగానే ఉన్నారు. వైసీపీ కూడా లోక్ సభలో, రాజ్యసభలో కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తూ వస్తొంది. అందుకే ఎన్డీఏ సర్కార్ ప్రవేశపెడుతున్న బిల్లులకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో వైసీపీ విప్ జారీ చేయడం లేదు. అనుకూలంగానే ఓటింగ్ వేస్తొంది. అనర్హత పిటిషన్ కు సంబంధించి లోక్ సభ కార్యాలయ వర్గాలు క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో రఘురామ కృష్ణంరాజును ఇక పార్టీ నుండి సస్పెండ్ చేసే అలోచన చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి.


Share

Related posts

BJP MP TG Venkatesh: బంజారాహిల్స్ భూ వివాదంలో కేసుపై టీజీ వెంకటేశ్ స్పందన ఇదీ

somaraju sharma

ఈ “జగ”మంత భజన యమ డేంజర్ : మేలుకో జగన్

Special Bureau

Rashmika Mandana : అభిమానులను స్వీటుగా తిట్టినా రష్మిక మందన..!!

sekhar