ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

రాజు గారి రివర్స్ సర్వే: జగన్ కోసమే .. ఆ సర్వే వెనుక అసలు సీక్రెట్ అదే..!

Share

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు రీసెంట్ గా ఏపి రాజకీయాలకు సంబంధించి ఓ సర్వే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సర్వే వాస్తవానికి దగ్గరగా ఉందా..? లేదా.. ఆ సర్వే వాస్తవాలు ఏమిటి.. ? సర్వేలో లొసుగులు ఏమిటి.. ? నిజాలు ఏమిటి అనేది..? పరిశీలిస్తే .. ఆ సర్వే ఒక రకంగా ఏకపక్షంగా ఉంది. కర్నూలు జిల్లా మొత్తం టీడీపీ స్వీప్ అన్నట్లుగా ఇచ్చారు. జిల్లాలోని 14 కి 14 టీడీపీ గెలుస్తుంది అని చెప్పారు. విజయనగరం జిల్లాలో 9 కి తొమ్మిదీ టీడీపీ కే లీడ్ ఇచ్చారు. అంటే 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో ఇప్పుడు టీడీపీ క్లీన్ స్వీప్ చేయబోతున్నది అన్నట్లుగా ఇచ్చారు. అసలు రఘురామ కృష్ణంరాజు సర్వే ఎందుకు రిలీజ్ చేశారు.. ? ఆయన సర్వే విడుదల చేయడం వెనుక ఏదైనా సీక్రెట్ అజెండా ఏమైనా ఉందా.. ? అనేది చూస్తే కఛ్చితంగా ఉందే అని భావించాల్సి వస్తుంది. ఎందుకంటే .. రఘురామ కృష్ణంరాజులో సెటైరికల్ యాంగిల్ ఎక్కువ. గోదావరి జిల్లా కాబట్టి వెటకారంతో వ్యంగ్యంగా విమర్శించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. దానిలో భాగంగానే ఈ సర్వే రిలీజ్ చేసినట్లు భావిస్తుండవచ్చు.

రియాలిటీకి దూరంగా నేషనల్ మీడియా సర్వే నివేదికలు?

ఎందుకంటే .. ఆయన సర్వే చూస్తే కొన్ని చూట్ల వాస్తవానికి దగ్గరగా ఉంది. మరి కొన్ని చూట్ల వాస్తవానికి దూరంగా ఉంది. టీడీపీని గుడ్డిగా నమ్మే వాళ్లు ఆ సర్వేని నమ్ముతారు. నమ్మని వారు ఆ సర్వేని నమ్మరు. రఘురామ కృష్ణంరాజు సర్వే సీక్రెట్ అజెండా ఏమిటంటే.. ? ఇటీవల నేషనల్ మీడియా సర్వేలు అంటూ వరుస బెట్టి రిలీజ్ చేశారు. జూలై 30న ఇండియా టీవీ వాళ్లు 19 ఎంపీ సీట్లు వైసీపీకి అని ఇచ్చేశారు. ఆగస్టు 11న ఇండియా టుడే వాళ్లు 18 ఎంపీ సీట్లు వైసీపీకి ఇచ్చారు. ఆగస్టు 15న టైమ్స్ నౌ అనే సంస్థ 17 నుండి 23 సీట్లు వైసీపీ గెలుస్తుంది అని ఇచ్చారు. నేషనల్ మీడియా ఇస్తున్న ప్రతి సర్వేలోనూ వైసీపీకే ఎక్కువ ఎంపీ సీట్లు వస్తున్నాయి. ఇది రియాలిటీకి దూరంగా ఉంది. వైసీపీకి 12 -13 వస్తాయి అంటే జనాలు నమ్ముతారు. విశ్లేషకులు విశ్వసిస్తారు. మరీ 18 – 23 అంటే నమ్మశక్యంగా లేదు. రియాలిటీకి దూరంగానే ఈ సర్వేలు ఉన్నట్లు కనబడుతోంది.

రఘురామ కృష్ణంరాజు రివర్స్ కౌంటర్

ఈ సర్వేలను వెటకారం చేస్తూ రఘురామ కృష్ణంరాజు తన సర్వే విడుదల చేసినట్లుగా కనబడుతోంది. మీకు అనుకూలంగా సర్వేలు వస్తున్నాయని సంబర పడిపోతున్నారు. నేషనల్ మీడియా ద్వారా సర్వేలు రిలీజ్ చేయించుకుంటున్నారు. కానీ అసలు వాస్తవం వేరు. అన్ని జిల్లాల్లోనూ టీడీపీ లీడ్ లోనే ఉంది. తాను సర్వే చేయించారు. వైసీపీకి అంత బలం లేదు అన్నట్లుగా వారు చెబుతున్న సర్వేలకు వెటకారంగా వాళ్లు చెబుతున్నది వాస్తవానికి దూరంగా ఉండగా, ఆదే మాదిరి సర్వేని రఘురామ కృష్ణంరాజు రిలీజ్ చేశారు. ఇలా సర్వే చేస్తే వాళ్లు సర్వేని డైవర్ట్ చేయవచ్చు. ఇది రివర్స్ కౌంటర్ గా అనుకోవచ్చు.

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?


Share

Related posts

Verri Puchha: వెర్రి పుచ్చ గింజల నూనె తో తెల్ల జుట్టు నల్లగా.. ఈ నొప్పులకు చెక్..!

bharani jella

జుట్టు ఊడకుండా, పొడవుగా పెరగాలంటే  ఈ ఒక్కటి  తింటే చాలు !!

Kumar

తెలుగు భాషాభిమానులను కుషీ చేసిన పీఎం నరేంద్ర మోడీ

somaraju sharma