NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Vijaya Sai Reddy: టీడీపీకి ఇక చుక్కలే.. వైసీపీ నేత విజయసాయి కీలక వ్యాఖ్యలు

Vijaya Sai Reddy: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇక చుక్కలు చూపించాలని వైసీపీ డిసైడ్ అయ్యింది. ఇది ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాటల్లోనే స్పష్టం అవుతోంది. శుక్రవారం విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని విజయసాయి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ చర్యలపై ఆయన ఘాటుగా విమర్శించారు. నిన్న టీడీపీ నేత నారా లోకేష్ విద్యార్ధులతో నిర్వహించిన జూమ్ మీటింగ్ లోకి మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎంటర్ అయి ఆయనకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విజయసాయిరెడ్డి స్పందిస్తూ లోకేష్ జూమ్ మీటింగ్ కంసమామ జగన్ అంటూ పేరు పెట్టారనీ, దీన్ని బట్టి లోకేష్ ఎఁత జగుస్పాకరమైన వ్యవహారాలు చేస్తున్నారో అర్ధం అవుతుందన్నారు. టీడీపీ కుసంస్కారంతో వ్యవహరిస్తోందనీ, తమ పార్టీ వాళ్లను అస్యభ పదజాలంతో దూషిస్తున్నారని అందుకే ప్రశ్నించడానికి లోకేష్ జూమ్ మీటింగ్ లోకి మా వాళ్లు వెళ్లారని అన్నారు. నిన్న జరిగింది ఆరంభం మాత్రమేననీ, రానున్న రోజుల్లో మరింత ఎదురుదాడి చేస్తామని విజయసాయి రెడ్డి హెచ్చరించారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. తండ్రి కొడుకులు పద్దతి మార్చుకోకపోతే తగిన బుద్ది చెప్పాల్సి వస్తుందని అన్నారు విజయసాయిరెడ్డి.

YCP MP Vijaya Sai Reddy Serious Comments On TDP
YCP MP Vijaya Sai Reddy Serious Comments On TDP

 

Vijaya Sai Reddy: సీఎంను తిట్టడమేమిటి

పదవ తరగతి విద్యార్ధులు ఫెయిల్ కావడానికి కారణాలు తెలుసుకోవాలే కానీ సీఎం ను తిట్టడమేమిటని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. కుసంస్కారంతో మా నాయకులను తిట్టకుండా వాస్తవాలు తెలుసుకుని, ప్రజాస్వామ్య పద్ధతుల్లో వ్యవహరించాలని సూచించారు విజయసాయిరెడ్డి. లోకేష్ సవాల్ ను స్వీకరిస్తున్నామనీ, చర్చకు రావాలని కోరుతున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు వచ్చినా సరే చర్చకు తాము సిద్దమేనని అన్నారు విజయసాయిరెడ్డి. జూమ్ లోనే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక లోకేష్ పారిపోయారని అన్నారు. టెన్త్ క్లాస్ పిల్లలు అడిగితేనే వంశీ, నాని, రజిని లు లోకేష్ జూమ్ మీటింగ్ లో ఎంటర్ అయ్యారనీ, వాళ్ల మీద సీఐడీకి ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. ఎవరైనా విద్యార్ధులు ఆత్మహత్య చేసుకుని ఉంటే వారింటికి వెళ్లి ఓదార్చాలి కానీ రాజకీయాలు చేయడం కరెక్టు కాదని విజయసాయిరెడ్డి అన్నారు.

 

26 జిల్లాల్లో పార్టీకి సొంత భవనాలు

రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ పార్టీ సొంత కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు విజయసాయిరెడ్డి. ఎన్నికలకు సంవత్సరం ముందే అన్ని జిల్లాల్లో పార్టీ సొంత కార్యాలయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పార్టీ ఆఫీసు అంటే దేవాలయం లాంటిదని తమ నమ్మకమని అన్నారు విజయసాయిరెడ్డి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?