NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Vijayasai Reddy: ‘బాబు’ది పచ్చని కుటుంబాల్లో నిప్పులు పోసే ఆలోచన

Advertisements
Share

Vijayasai Reddy:  ఏపిలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం పాలసీలో సమూల మార్పులు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో మద్యం నిషేదం చేస్తామని ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మద్య నిషేదం ఆచరణ సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చి దశలవారీగా మద్య నిషేదం అని చెప్పారు. గతంలో ఉన్న ఎక్సైజ్ విధానాలను పూర్తిగా మార్చారు. ప్రభుత్వ మద్యం దుకాణాలను తీసుకువచ్చారు. మద్యం ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులోకి లేకుండా చేస్తే వారు దానికి దూరం అవుతారని భావించారు. అంతే కాకుండా ఏడాదికి 20 శాతం చొప్పున షాపులు తగ్గిస్తే అయిదేళ్లలో మద్యం షాపులను తొలగించి కేవలం ఫైస్టార్ హోటల్స్, బార్ లలోనే మద్యం అందుబాటులో ఉండే విధంగా చేద్దామని అనుకున్నారు. ఇలా చేస్తే సాధారణ ప్రజానీకానికి మద్యం అందుబాటులో లేకపోతే వారు పూర్తిగా మానివేస్తారుట.

Advertisements

ఈ క్రమంలో గతంలో పేద మందుబాబులకు అందుబాటులో ఉండే చీప్ లిక్కర్ ను తీసేశారు. గతంలో చీప్ లిక్కర్ రూ.50లకు లభించేది. ఆ బ్రాండ్ ను పూర్తి గా తీసేశారు. అన్ని మధ్యం ధరలను బాగా పెంచేశారు. దీంతో గతంలో రెండు క్వార్టర్ లు తాగే వారు ఒక్క క్వార్టర్ కొనుగోలు చేసుకుని సరిపుచ్చుకున్నారు. దీని వల్ల కొంత మేర మద్యం కొనుగోళ్లు తగ్గాయి. ప్రభుత్వానికి మాత్రం పెరిగిన ధరలతో ఆదాయం బాగానే సమకూరింది. అయితే పొరుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున అక్రమంగా తీసుకువచ్చి విక్రయాలు చేసే వారి సంఖ్య పెరగింది. ఇది గమనించిన ప్రభుత్వం కొద్దిగా ధరలు తగ్గించింది. అయినప్పటికీ మందు బాబులు ప్రభుత్వాన్ని తిడుతూనే ఉన్నారు. మందుబాబుల మనసు గెలుచుకునేందుకు చంద్రబాబు తన సభ ల్లో మధ్యం తగ్గిస్తానంటూ చెబుతున్నారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ వ్యంగ్యంగా విమర్శించారు.

Advertisements

“ఆయన వస్తే మద్యం ధరలు తగ్గిస్తారని మందుబాబులంతా ఒక్కొక్కరు పది మందికి, వాళ్లు వంద మందికి చెప్పి ఓట్లు వేయించాలంట. గతంలో మద్య నిషేదం ఎత్తివేసిన వ్యక్తి, ఇటువంటి దిక్కుమాలిన హామీ ఇచ్చే వ్యక్తి ‘విజనరీ’ ఎలా అవుతాడు” అని ప్రశ్నించారు. పచ్చని కుటుంబాల్లో నిప్పులు పోసే ఆలోచన కాక మరేమిటి అని అన్నారు.

BRS: ఆ మాజీ ఎమ్మెల్యేకి బిగ్ షాక్ ఇచ్చిన ప్రత్యర్ధులు .. సోషల్ మీడియాలో రాసలీలల ఫోటోలు వైరల్


Share
Advertisements

Related posts

బ్రేకింగ్: ప్రభాస్21 సినిమా అప్డేట్ టైమ్ ఫిక్స్

Vihari

వామ్మో ! కాంగ్రెస్ లోగుట్టు రాజకీయాలు ఇలా ఉంటాయా?

Yandamuri

బ్రిటన్ నుండి భారత్ కు వచ్చిన చివరి విమానం వల్ల ఇంత నష్టం జరిగిందా…?

siddhu