Subscribe for notification

YCP MP Vijayasai Reddy: చంద్రబాబు తల్లకిందులుగా తపస్సు చేసినా దాన్ని అడ్డుకోలేరంటూ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Share

YCP MP Vijayasai Reddy: విశాఖ పరిపాలనా రాజధాని కావడం ఖాయమని మరో సారి స్పష్టం చేశారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. గురువారం విశాఖలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తల్లకిందులుగా తపస్సు చేసినా విశాఖను పరిపాలనా రాజధానిగా కాకుండా అడ్డుకోలేరని అన్నారు. ఏపిలో మూడు రాజధానుల అంశం పై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. అమరావతిలోనే రాజధాని అభివృద్ధి చేయాలని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా మూడు రాజదానుల విధానంపైనే వైసీపీ కట్టుబడి ఉందంటూ ఆ పార్టీ నేతలు చెబుతూనే ఉన్నారు. సాంకేతిక కారణాలు చూపి మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం వెనక్కు తీసుకున్నా.. పకడ్బందీగా మరో సారి బిల్లు తీసుకువస్తామని గతంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చెప్పారు. అయితే హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం ఇంత వరకూ సుప్రీం కోర్టులో సవాల్ చేయకపోవడం, అసెంబ్లీలో కొత్తగా బిల్లును తీసుకురాకపోవడంతో అనిశ్చితి కొనసాగుతోంది. ఈ తరుణంలో విజయసాయి రెడ్డి ఎవరు ఆపినా విశాఖ కు పరిపాలనా రాజధాని అగదని మరో సారి స్పష్టం చేశారు.

YCP MP Vijayasai Reddy Comments on visakha capital

ఇదే క్రమంలో రాష్ట్రపతి ఎన్నిక వ్యవహారంలో వైసీపీ స్టాండ్, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడి ఇష్యూ పై కూడా మాట్లాడారు విజయసాయిరెడ్డి. కాలువలు, చెరువులు, నదులు అక్రమించే హక్కు ఎవరికీ లేదని అన్నారు విజయసాయిరెడ్డి. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు కాలువను ఆక్రమించారని అధికారుల వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయనీ, ప్రస్తుతానికి అయన్న పాత్రుడు హైకోర్టులో తాత్కాలిక స్టే తెచ్చుకున్నప్పటికీ ఆ విషయాన్ని తర్వాత అధికారులు చూసుకుంటారని పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ మద్దతు ఎవరికి ఇవ్వాలన్న విషయంపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న విజయసాయిరెడ్డి … ఈ విషయంలో పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అయినా అణగారిన వర్గాలకు అత్యున్నత పదవులు ఇస్తామంటే ఎవరు కాదంటారు అని పరోక్షంగా ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు తాము మద్దతు ఇస్తామన్నట్లుగా వ్యాఖ్యానించారు. ద్రౌపది ముర్మును ఎన్ డీ ఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించిన అనంతరం విజయసాయిరెడ్డి ఆమెను కలిసి అభినందనలు తెలియజేసిన సంగతి తెలిసిందే.


Share
somaraju sharma

Recent Posts

Rana: ఆ బాలీవుడ్ స్టార్ హీరో సినిమా నుండి బయటకొచ్చేసిన రానా..??

Rana: దగ్గుబాటి రానా(Rana) హీరోగా మాత్రమే కాదు అన్ని రకాల పాత్రలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం…

6 mins ago

Prabhas: ప్ర‌భాస్ ఆ డైరెక్ట‌ర్ కు హ్యాండ్ ఇవ్వ‌డం ఖాయ‌మేనా?

Prabhas: పాన్ ఇండియా స్టార్‌గా స‌త్తా చాటుతున్న టాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ ప్ర‌భాస్ వ‌రుస భారీ చిత్రాలతో ఎంత బిజీగా…

42 mins ago

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బీజేపీ నుండి దూరం అవుతున్నట్లే(నా)..! ఈ ప్రసంగంలో భావం అలానే ఉందిగా..!?

Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…

1 hour ago

Shriya Saran: ఎంత భ‌ర్తైతే మాత్రం రోడ్డుపై అత‌డితో అంత రెచ్చిపోవాలా శ్రియా..?

  Shriya Saran: అందాల భామ శ్రియ‌ సరన్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…

2 hours ago

CM YS Jagan: కుమార్తె హర్ష ప్రతిభకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్

CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…

2 hours ago

Vijay Deverakonda: విజ‌య్ న‌గ్న ఫొటోను వ‌ద‌ల‌డం వెన‌క అస‌లు కార‌ణం ఏంటో తెలుసా?

Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగ‌ర్‌`. డాషింగ్ అండ్ డైన‌మిక్…

3 hours ago