ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ప్రధాన మంత్రి మోడీని కలిసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..ఎందుకంటే..?

Share

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్ కార్యాలయంలో విజయసాయిరెడ్డి మర్యాదపూర్వకంగా ప్రధాన మంత్రి మోడీని కలిసి దుశ్సాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. తన భేటీ అంశాన్ని విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. నీతి ఆయోగ్ సమావేశం విజయవంతం కావడం పట్ల చర్చించామని వెల్లడించారు విజయసాయిరెడ్డి. అదే విధంగా ఏపికి చెందిన కీలక విషయాలపైనా ప్రధానితో మాట్లాడినట్లు తెలిపారు. ఆయా అంశాల్లో కేంద్ర ప్రభుత్వ సహాయం అవసరం అన్న విషయాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లానని విజయసాయి వివరించారు. ఆంధ్రప్రదేశ్ అబివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తోడ్పాటు అందించాలని కోరినట్లు తెలిపారు.

 

ఇటీవల అజాదీకా అమృత్ మహోత్సవ్ సమావేశానికి హజరైన ఏపి ప్రతిపక్ష నేత చంద్రబాబుతో ప్రధాని మోడీ ముచ్చటించిన అంశంపై టీడీపీ అనుకూల మీడియాలో మోడీతో చంద్రబాబు స్నేహం మళ్లీ చిగురిస్తొందనీ, చంద్రబాబుతో ప్రేమగా మాట్లాడినట్లుగా వస్తున్న వార్తలపై విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ట్వీట్ లు చేశారు. మరో పక్క మోడీ చంద్రబాబుతో మాట్లాడిన మరుసటి రోజే నీతి ఆయోగ్ కౌన్సిల్ మీటింగ్ కు హజరైన ఏపి సీఎం వైఎస్ జగన్ కు మోడీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ ను ప్రధాని మోడీ ప్రత్యేకంగా లంచ్ కు ఆహ్వానించారు. లంచ్ మీటింగ్ దాదాపు గంట పాటు సాగింది. భోజన విరామ సమయంలో తన టేబుల్ వద్దకు జగన్ ను మోడీ ఆహ్వానించారు. మోడీతో కలిసి జగన్ లంచ్ చేశారు. అది కొద్ది మందికే ఈ అహ్వానం అందింది. అందులో ఏపి సీఎం జగన్ ఒకరున్నారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి.

నీతి అయోగ్ లో ఏపిలో అమలు చేస్తున్న చరిత్రక నిర్ణయాలను వివరించిన సీఎం వైఎస్ జగన్


Share

Related posts

MAA Elections: బండ్ల గణేశ్ మార్క్ ప్రచారం..!!

somaraju sharma

Today Horoscope డిసెంబర్ 14th సోమవారం రాశి ఫలాలు

Sree matha

నేడు మకర జ్యోతి దర్శనం

Siva Prasad