YCP Plenary 2022: తెలుగుదేశం (Telugudesam) పార్టీ మహానాడు (Mahanadu) మే 27, 28 తేదీల్లో ఒంగోలులో జరిగిన విషయం తెలిసిందే. ఈ మహానాడు ఆ పార్టీ ఊహించిన దానికంటే సక్సెస్ అయ్యింది. టీడీపీ (TDP) అంచనా ప్రకారం లక్షా 50 నుండి లక్షా 70వరకూ అనుకుంటే ఇంటెలిజెన్స్ లెక్కలు లక్ష వరకూ అని లెక్కలు వేశారు. 50 నుండి 70వేల మంది వస్తే గగనమే అని వైసీపీ (YCP) అనుకుంది. అయితే ఈ అంచనాలకు మించి సుమారు మూడున్నర లక్షల మంది వరకూ హజరైయ్యారు. ఇక జూలై 8,9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నిర్వహిస్తున్నారు. దాదాపు 120 ఎకరాల స్థలంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు అయిదు లక్షల మంది కార్యకర్తలు, నాయకులు హజరవుతారని అంచనాతో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
వైసీపీ టార్గెట్ ఏమిటి..? ప్లీనరీ సందర్భంగా వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ పార్టీ నేతలకు ఇచ్చిన టార్గెట్ ఏమిటి..? అనేది చెప్పుకుంటే.. ప్లీనరీకి అయిదు లక్షలకు తగ్గకుండా పార్టీ శ్రేణులు రావాలనేది, కృష్ణా, గుంటూరు, ప్రకారం, ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాల నుండే రెండున్నర లక్షల మంది హజరుకావాలని నిర్దేశించారుట. రాయలసీమ, నెల్లూరు జిల్లాల నుండి అధిక సంఖ్యలో ప్లీనరీకి ఎలాగూ వస్తారు. జిల్లాల వారిగా టార్గెట్ లు ఇచ్చినట్లు సమాచారం. ప్లీనరీ సందర్భంగా అధినేత వైఎస్ జగన్ కొన్ని ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ఈ మూడు సంవత్సరాల్లో ఏమి చేశాము, రాబోయే రెండేళ్లలో చేయబోయేది ఏమిటి..? వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తరువాత చేయబోయేది ఏమిటి..? అనే విషయాలను వెల్లడిస్తారుట.
2017లో జరిగిన ప్లీనరీలో నవరత్నాలను ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తరువాత నవరత్నాలను జనాల్లోకి తీసుకువెళ్లారు. వచ్చే ఎన్నికల నాాటికి ఈ నవరత్నాలకు మరిన్ని మార్పులు చేసి వచ్చే ఎన్నికల తరువాత ఏ విధమైన పథకాలను అందిస్తారు అనే విషయాలను జగన్మోహనరెడ్డి చెప్పనున్నారు. అదే విధంగా కార్యకర్తలు ఏ విధంగా పని చేయాలి..? వాలంటీర్ల బాధ్యతలు, ఎమ్మెల్యేల సీట్ల మార్పు, ఎంత మందికి సీట్లు ఇచ్చే అవకాశం ఉంది..? ఎంత మందిని ఆపే అవకాశం ఉంది. టికెట్లు ఇవ్వని ఎమ్మెల్యేలకు ఎటువంటి పదవులు ఇస్తారు.? అనే విషయాలపైనా పార్టీ అధినేత, సీఎం జగన్ ప్లీనరీ వేదికగా ఒక క్లారిటీ ఇస్తారని సమాచారం.
మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే 47 ఆయుధాలు కల్గిన పడవ కనిపించడం కలకలాన్ని రేపింది. ముంబైకి 190 కిలీ మీటర్ల…
నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…
గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…
చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…
హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…
హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…