NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YCP : అందుకే జగన్ కి అంబటి అంటే పంచ ప్రాణాలు – కాలర్ ఎగరేసేపని చేశాడు.

YCP : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సంగ్రామం జరుగుతోంది. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు, 20 మందికిపైగా మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిత్యం మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరగదు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీపై గానీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై గానీ గట్టిగా విమర్శలు చేయడంలో ఒకరిద్దరు మంత్రులు మాత్రమే ఉన్నారు. అదే విధంగా వైసీపీ కీలకనేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్నా పంచ్ డైలాగ్ లు, ఘోటైన పదజాలంతో ఆయన విమర్శించేవారు కాదు. అయితే వీరందరి కంటే ప్రత్యర్థులపై ఘాటుగా విమర్శలు చేయడంలో గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ముందు వరుసలో ఉన్నారు.

YCP : sattenapalli mla ambati rambabu
YCP sattenapalli mla ambati rambabu

అంబటి రాంబాబు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో నిత్యం తన దైన శైలితో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపైనా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైనా పార్టీ అధికార ప్రతినిధి హోదాలో తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. అంబటి రాంబాబు ఘాటుగా చేసే విమర్శలు, కామెంట్స్ వెంటనే వైసీపీ సోషల్ మీడియాకు వెళ్లిపోతున్నాయి. పార్టీ క్యాడర్, అభిమానుల్లో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపేలా అంబటి రాంబాబు వ్యాఖ్యలు, విమర్శలు ఉంటుంటాయి. వైసీపీలో అంత మంది ఎమ్మెల్యేలు ఉన్నా అంబటి రాంబాబు చంద్రబాబు, లోకేష్, నిమ్మగడ్డ తదితరులను ఒక రేంజ్ లో విమర్శలు చేయడంలో ముందు వరుసలో ఉంటున్నారు.

ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వద్ద మంచి వాగ్దాటి ఉన్న నేతగా, నియోజకవర్గంలో గట్టి పట్టు ఉన్న ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు అంబటి రాంబాబు. విషయ పరిజ్ఞానం, సబ్జెక్ట్ తో అంబటి రాంబాబు మాట్లాడటంలో దిట్టగా పేరుంది. వాస్తవానికి తన సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేగా పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ లను గెలిపించుకుంటే ఆయనకు సరిపోతుంది. కానీ వైసీీపీ నుండి గట్టివాయిస్ వినిపించే వారు పార్టీ కార్యాలయానికి రాకపోవడంతో అంబటి నిత్యం ఇదొక పనిగా పెట్టుకుని ప్రత్యర్థులను ఆడేసుకుంటున్నారు. అయితే రాబోయే రోజుల్లో మంత్రి వర్గ విస్తరణలో అవకాశం కోసం అంబటి ఈ హడావుడి చేస్తున్నారని కూడా పార్టీలో ఓ చర్చ జరుగుతోంది. ఏది ఎలా ఉన్నాకాలర్ ఎగరేసే పని చేస్తుండటం వల్ల పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అంబటిపై ప్రత్యేక అభిమానం చూపుతున్నారని టాక్.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju