NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ, వైసీపీ సామాజిక (రాజకీయ) న్యాయం ఇదే(నా)..? సంగ్మా పోటీ చేసినప్పుడు గుర్తుకు రాని సామాజిక న్యాయం..!!

ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధి గా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఏపికి చెందిన అధికార వైసీపీ, విపక్ష టీడీపీ లు ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించాయి. ఇందుకు ఆయా పార్టీలు తొలిసారిగా గిరిజన మహిళకు రాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చినందుకు సామాజిక న్యాయ సిద్ధాంతంతో మద్దతు తెలియజేస్తుట్లు ప్రకటించాయి. ద్రౌపది ముర్ము ఏపి పర్యటనకు విచ్చేసి మద్దతు ఇచ్చినందుకు ఇరుపార్టీలకు కృతజ్ఞతలు తెలిపి వెళ్లారు.

 

రెండు పార్టీలు అధికారికంగా ఎన్డీఏ మిత్ర పక్షాలు కాదు, కానీ ..

వాస్తవానికి ఈ రెండు పార్టీలు అధికారికంగా ఎన్డీఏ మిత్ర పక్షాలు కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. విభజన హామీలను నెరవేర్చడం లేదు. పోలవరం ప్రాజెక్టు పెండింగ్ బకాయిలను ఇవ్వడం లేదు. ఇలా అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నా అధికార పక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి, ఇటు ప్రతిపక్ష నేత చంద్రబాబులు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చారు. సామాజిక న్యాయ సిద్దాంతంతో గిరిజన మహిళకు అవకాశం ఇవ్వడం వల్ల మద్దతు ఇస్తున్నట్లు ఈ రెండు పార్టీలు ఇప్పుడు ప్రకటించడంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు తప్పుబట్టారు. ఈ సామాజిక న్యాయం గతంలో పీఎ సంగ్మా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేసినప్పుడు గుర్తుకు రాలేదా..?  అని ప్రశ్నిస్తున్నారు. ఎవరికి కహానీలు చెబుతున్నారు అని ప్రశ్నించారు. 2012లో ఎన్డీఏ అభ్యర్ధిగా పీఏ సంగ్మా. యూపీఎ అభ్యర్ధిగా ప్రణబ్ ముఖర్జీ పోటీ పడ్డారు. ఆనాడు యూపీఎ అధికారంలో ఉంది. నాడు సంగ్మా బహిరంగంగానే ప్రకటించారు. రాష్ట్రపతిగా ఒ ఎస్టీ సామాజికవర్గానికి మొదటి సారిగా పోటీ చేసే అవకాశం వచ్చింది అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే ఆ నాడు కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చిన వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి .. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సంగ్మాను కాదని యుపీఏ అభ్యర్ధి ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చారు. ఆ పార్టీ ప్రజా ప్రజా ప్రతినిధులు ఆయనకు ఓటు వేశారు. ఆనాడు ఎన్డీఏ ఎస్టీ సామాజికవర్గానికి చెందిన సంగ్మాను పోటీకి నిలిపినా వైసీపీ సామాజిక న్యాయం పేరుతో మద్దతు ఇవ్వలేదు.

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము ఏపి పర్యటన విజయవంతం ..ఏపీ వైసీపీ, టీడీపీ సంపూర్ణ మద్దతు

సంగ్మా పోటీ చేసినప్పుడు టీడీపీ ఏకంగా రాష్ట్రపతి ఎన్నికలనే బహిష్కరించింది

అనాడు అధికార పక్షం నిలబెట్టిన ప్రణబ్ ముఖర్జీకి వైసీపీ సపోర్టు చేసింది. ఇక టీడీపీ ఆనాడు ఎన్నికలను బహిష్కరించింది. కాంగ్రెస్ అభ్యర్ధి ప్రణబ్ ముఖర్జీని సమర్ధించలేము, బీజేపీ మతోన్మాద పార్టీ కావడం వల్ల ఆ పార్టీ నిలబెట్టిన సంగ్మాకు బలపర్చలేము అని కారణంగా చెప్పి టీడీపీ ఆ ఎన్నికలకు దూరంగా ఉంది. 2014 ఎన్నికలు వచ్చే సరికి మతోన్మాదం పోయింది. బీజేపీ – టీడీపీ మిత్రపక్షాలు అయ్యాయి. 2018 లో బీజేపీ మతోన్మాద పార్టీ అయ్యింది విడిపోయాయి. ఇప్పుడు మళ్లీ 2022 వచ్చే సరికి రాష్ట్రపతి అభ్యర్ధిగా ఓ గిరిజన మహిళను నిలబెట్టినందుకు పీఎం మోడీకి చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఇప్పుడు సామాజిక న్యాయం అంటున్న టీడీపీ ఆనాడు ఎన్డీఏ అభ్యర్ధిగా పోటీ చేసిన సంగ్మాకు ఎందుకు మద్దతు ఇవ్వనట్లు. ఇప్పుడు గుర్తుకు వచ్చిన సామాజిక న్యాయం ఈ రెండు పార్టీలకు ఆనాడు ఎందుకు గుర్తుకు రానట్లో. ఈ వ్యవహారంపై విశ్లేషించిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు రెండు పార్టీలకు చురకలు అంటించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju