NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YCP Vs BJP: ఇక్కడ కొట్లాట ..అక్కడ దోస్తాన్ ..! బీజేపీ, వైసీపీ తీరుకు సాక్షం ఇదిగో..!!

YCP Vs BJP: గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో వైసీపీ, బీజేపీ తీరు తీస్తుంటే అబ్బో ఇక ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది, కేంద్రంలోని బీజేపీ కూడా జగన్ సర్కార్ పై సీరియస్ గా ఉంది. ఇక జగన్ సర్కార్ కు రోజులు దగ్గర పడ్డాయి అన్నట్లుగా నేతల మాటలు ఉంటాయి. ఈ వార్తలకు ఊతం ఇచ్చేలా వైసీపీ మంత్రులు మాట్లాడటం, దానికి ఏపి బీజేపీ నేతల కౌంటర్ ఇవ్వడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఇక్కడ ఏపిలో బీజేపీ, వైసీపీ నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటారు. చూస్తే బీజేపీకి, వైసీపీకి ఏ మాత్రం పొసగడం లేదు అన్న భావన కల్గించేలా ఉంటాయి. అటు ఢిల్లీ స్థాయిలో చూస్తే బీజేపీ, వైసీపీ పరస్పర సహకారం, దోస్తాన్ కనబడుతూనే ఉన్నాయి.

YCP Vs BJP politics
YCP Vs BJP politics

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఇటీవలే పీఎసీ సభ్యుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. మరో పక్క కేంద్ర కేబినెట్ లో వైసీపీ చేరనున్నందంటూ సోషల్ మీడియాలో ప్రచారం, దానికి ఊతం ఇచ్చేలా విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు రావడం తెలిసిందే. విజయసాయి రెడ్డి ఇటీవల బీజేపీ తమను కేంద్ర మంత్రివర్గంలోకి ఆహ్వానించిందని వెల్లడించారు. అంటే వైసీపీని కేంద్రంలోని బీజేపీ మిత్ర పార్టీగా భావిస్తున్నట్లేగా. ఇదిలా ఉంటే ఏపిలో బీజేపీపై వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శించడం, దీనికి ప్రతిగా బీజేపీ కూడా ఘాటుగా కౌంటర్ లు ఇవ్వడం కనబడుతోంది.

వీటికి తోడు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండించడంతో పాటు రౌడీల పార్టీ అంటూ వైసీపీని ఘాటు విమర్శలు చేయడం జరిగింది. కేంద్ర కేబినెట్ లో ఆహ్వానించారని విజయసాయి వ్యాఖ్యానించడంతో ఏపి బీజేపీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. “మేము ఆంధ్రప్రదేశ్ లో రౌడీల పర్టీ వైఎస్ఆర్ సీపీతో ఎలాంటి పొత్తుకు ప్రయత్నించ లేదు. దీనికి విరుద్ధంగా, మరో కుటుంబ పార్టీ టీడీపీ గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రజల తరపున ఎలాంటి పోరాటాలు చేయనప్పటికీ వైఎస్ జగన్ గారి ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై అనేక ధర్నాలను నిర్వహిస్తున్నాము” అంటూ బీజేపీ ట్వీట్ చేసింది. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమని పిస్తుంది. ఇక్కడ కుస్తీ .. అక్కడ దోస్తీ అనిపిస్తుంది కదా..!

author avatar
sharma somaraju Content Editor

Related posts

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!