NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీలో ఎన్నిక‌ల ప‌ర్వం ముగిసింది. సోమ‌వారం జ‌రిగిన పోలింగ్‌లో 81.86 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇది ఎవ‌రికీ అంతుచిక్క‌ని విష‌యం. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఈ రేంజ్‌లో పోలింగ్ ఎప్పుడూ న‌మోదు కాలేదు. దీంతో దీనికి సంబంధించిన ఏయే విష‌యాలు ప‌నిచేశాయ‌నే చ‌ర్చ అన్ని పార్టీల్లోనూ జ‌రుగుతోం ది. కులాలు, మ‌తాల వారీగా కూడా..నాయ‌కులు లెక్క‌లు వేసుకుంటున్నారు. వీటిలో ప్ర‌ధానంగా 5 అంశాలు ప్ర‌భావం చూపాయ‌ని ఏ పార్టీకి ఆ పార్టీఅంచ‌నా వేస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1) సంక్షేమ ప‌థ‌కాలు: దేశంలో ఎక్క‌డా లేని విధంగా సంక్షేమాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని.. 2.7 ల‌క్ష‌ల కోట్ల మేర‌కు ప్ర‌జ‌ల‌కు పంచామ‌ని సీఎం జ‌గ‌న్ చెప్పారు. వృద్ధులు, మ‌హిళ‌ల‌ను సెంట్రిక్ గా చేసుకుని ఆయ‌న ప్ర‌చారాన్ని దంచి కొట్టారు. ఇది త‌మ‌కు లాభిస్తుంద‌ని వైసీపీ అంటోంది. అందుకే ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ జ‌రిగిందని అంచ‌నా వేసింది.

2) జ‌గ‌న్ పాల‌న‌: జ‌గ‌న్ పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌ని.. ఆయ‌న‌కు పాల‌న చేయ‌డంచేత‌కాద‌ని ప్ర‌జ‌లు నిర్ధారించుకున్నార‌ని.. టీడీపీ చెబుతోంది. అందుకే పోటెత్తార‌ని అంటోంది. ముఖ్యంగా ర‌హ‌దారులు, ప్రాజెక్టులు లేక‌పోవ‌డం, అభివృద్ధి లేక‌పోవ‌డం వంటివి ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేశాయ‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఇదే త‌మ‌కు ప్ల‌స్ అవుతుంద‌ని లెక్క‌లు వేసుకుంటున్నారు.

3) రాజ‌ధాని: మూడు రాజ‌ధానుల అంశం క‌లిసి వ‌చ్చింద‌ని వైసీపీ ఎక్క‌డా చెప్ప‌డం లేదు. ఇదే నిజ‌మైతే.. విశాఖ‌లో ఓట‌రు పోటెత్తాలి. కానీ, అక్క‌డే త‌క్కువ గా పోలింగ్ న‌మోదైంది. ఇక‌, అమ‌రావ‌తి త‌మ‌కు క‌లిసి వ‌చ్చింద‌ని.. తాము అధికారంలోకి రాగానే.. రాజ‌ధానిని నిర్మిస్తామ‌న్న హామీ మేర‌కు ప్ర‌జ‌లు త‌మ‌కు అనుకూలంగా ఓటేశార‌ని టీడీపీ చెబుతోంది. దీనిపై సందిగ్ధం అలానేకొన‌సాగుతోంది.

4) ఉద్యోగాలు-ఉద్యోగులు: రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగింద‌ని, ఉద్యోగాలు లేక‌.. నిరుద్యోగులు ప్ర‌భుత్వం పై ఆగ్ర‌హంతో ఉన్నార‌ని టీఆడీపీ లెక్క‌లు వేసుకుంది. తాము అధికారంలోకి వ‌చ్చాక 20 ల‌క్ష‌ల ఉద్యోగా లు ఇస్తామ‌ని హామీ ఇచ్చినందున వోటేశార‌ని చెబుతున్నారు. ఇక‌, ప్ర‌భుత్వ ఉద్యోగులు వైసీపీపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నార‌ని చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇదే విష‌యంపై వైసీపీ భిన్న‌మైన వాద‌న వినిపిస్తోంది. తాము వ‌చ్చాక‌.. 2.31 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇచ్చామ‌ని, ఉద్యోగుల‌కు మంచి పీఆర్సీ ఇచ్చామ‌ని కాబ‌ట్టి వారు ఓటు కూడా త‌మ‌కేన‌ని అంటోంది.

5) మ‌హిళ‌లు: తాము అమ‌లు చేస్తున్న సంక్షేమంలో మ‌హిళ‌ల‌దే కీల‌క పాత్ర అని.. అందుకే వారు పోటెత్తి మ‌రీ.. క్యూలైన్ల‌లో నిల‌బ‌డి ఓటేశార‌ని.. వైసీపీ చెబుతోంది. కానీ, ఇంత క‌న్నా ఎక్కువ‌గా ఇస్తామ‌ని చెప్పాం కాబ‌ట్టి.. ముఖ్యంగా ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణాన్ని వెల్ల‌డించామ‌ని కాబ‌ట్టి త‌మ‌కే ఓటేశార‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. ఇలా.. ఎవ‌రి వాద‌న ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఈ 5 అంశాలు మాత్రం ఎన్నిక‌ల పోలింగ్‌ను ట‌ర్న్ తిప్పింద‌నేది వాస్త‌వం అంటున్నారు ప‌రిశీల‌కులు.

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N