NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YCP Vs TDP: అయ్యన్న వ్యాఖ్యల దుమారం..! జోగి రమేష్ ఆందోళనతో  చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత..!!

YCP Vs TDP: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, మంత్రులపై మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయ్యన్న వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు మాజీ మంత్రి చంద్రబాబు నివాసం ముట్టడికి రావడం ఉద్రిక్తతలకు దారి తీసింది. చంద్రబాబు నివాసానికి వచ్చిన జోగి రమేష్ ను టీడీపీ నేతలు బుద్దా వెంకన్న తదితర టీడీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీల నాయకులు పరస్పరం నినాదాలు, దూషణలతో అక్కడ పరిస్థితి రణరంగంగా మారింది. పోలీసులు బారికేడ్లను పెట్టి ఇరువర్గాలను నిలువరించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో లాఠీలను ఝులిపించారు.

YCP Vs TDP:  tension created near chandrababu house after jogi ramesh protest
YCP Vs TDP tension created near chandrababu house after jogi ramesh protest

ఈ సందర్భంలో జోగి రమేష్, బుద్దా వెంకన్న మధ్య తీవ్వ వాగ్వివాదం జరిగింది. ఇరువర్గాల తోపులాటలో బుద్దా వెంకన్న స్వల్ప అస్వస్థతకు గురై సొమ్మసిల్లి కిందపడిపోయారు. ఇదే క్రమంలో జోగి రమేష్ కార్యకర్తలతో రోడ్డుపై భైటాయించి నిరసన తెలిపారు. చంద్రబాబు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. రాళ్ల దాడిలో జోగి రమేష్ కారు అద్దాలు ద్వంసం అయ్యాయి. ఘర్షణ మరింత ముదురుతున్న క్రమంలో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి జోగి రమేష్ ను అరెస్టు చేసి తీసుకువెళ్లారు.

శాంతియుతంగా నిరసన తెలియడానికి వస్తే తమపై చంద్రబాబు దాడి చేయించారంటూ జోగి రమేష్ ఆరోపించారు. చంద్రబాబు క్షమాపణ చెప్పకుంటే రాష్ట్రంలో తిరిగనివ్వమని జోగి హెచ్చరించారు. చంద్రబాబు నివాసంపైకి జోగి రమేష్ కార్యకర్తలతో దౌర్జన్యంగా వచ్చి దాడికి పాల్పడ్డారని బుద్దా వెంకన్న, పట్టాభి, గద్దె రామ్మోహన్ తదితర నేతలు ఆరోపణ చేశారు. జోగి రమేష్ ముందుగా చంద్రబాబు ఇల్లు మట్టడిస్తామని సోషల్ మీడియాలో పోస్టు చేసినా పోలీసులు నిలువరించలేదని టీడీపీ నేతలు ఆరోపించారు. తమపైనే దాడి చేశారంటూ టీడీపీ, వైసీపీ శ్రేణులు ఆరోపణలు చేసుకున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!

PM Modi: రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోడీ కౌంటర్ ఇలా .. ‘శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ నాలుగో తేదీ తెలుస్తుంది’  

sharma somaraju