NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Mydukur : టీడీపీ గెలిచిన రెండులో ఒకటి పాయే..!!

Mydukur  : ఇటీవల జరిగిన పుర ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు తెలుగుదేశం పార్టీ కేవలం రెండు మున్సిపాలిటీలలోనే అధికార వైసీపీ కంటే అధిక్యత సాధించింది. అనంతపురం జిల్లా తాడిపత్రి, కడప జిల్లా మైదుకూరులో టీడీపీ మెజార్టీ సాధించిన సంగతి తెలిసిందే. తాడిపత్రి విషయానికి వస్తే మాజీ మంత్రి, టీడీపీ నేత జేసి ప్రభాకరరెడ్డి స్వయంగా కౌన్సిలర్ గా పోటీ చేసి గెలవడంతో పాటు చైర్మన్ ఎన్నిక విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి సక్సెస్ అయ్యారు.

YCP won the Mydukur
YCP won the Mydukur

తాడిపత్రి మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో సభ్యులైన ఎంపి, ఎమ్మెల్యేల ఓట్లతో వైసీపీ, టీడీపీ కి 18-18 బలం కాగా సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో జేసి ప్రభాకరరెడ్డి చైర్మన్ గా ఎన్నికైయ్యారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయినప్పటి నుండి అధికార పార్టీ ప్రలోభాలు టీడీపీ వర్గీయుల దరి చేరకుండా జేసి ప్రభాకరరెడ్డి  ఎన్నికైన కౌన్సిలర్‌లను క్యాంప్ కు తరలించారు. నేడు నేరుగా క్యాంపు నుండి కౌన్సిలర్లను మున్సిపాల్ కార్యాలయానికి తీసుకువచ్చారు. తొలుత తాడిపత్రిని కూడా వైసీపీ ఏదో విధంగా హస్తగతం చేసుకోవాలని వైసీపీ భావించింది. ఇదే విషయాన్ని మంత్రి బొత్సా సత్యనారాయణే స్వయంగా పేర్కొన్నారు. ఒకటి రెండు చోట్ల తమకు సంఖ్యాపరంగా తక్కువ కౌన్సిలర్ లు ఎన్నికైనా ఎక్స్ అఫిషియో సభ్యులతో అవి కూడా కైవశం చేసుకుంటామని ఆయన అన్నారు. అయితే అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దని, సభ్యులను ప్రలోభాలకు గురి చేయవద్దని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆ పార్టీ నేతలకు ప్రత్యేకంగా ఆదేశించడంతో ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు.

ఇక కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ విషయానికి వస్తే ఇక్కడ వైసీపీ ఎత్తుగడలు ఫలించాయి. టీడీపీ మెజార్టీ స్థానాలు కైవశం చేసుకున్నా పాలకవర్గాన్ని చేజిక్కించుకోలేకపోయింది. టీడీపీకి చెందిన 12 మంది సభ్యులలో ఒకరు ఓటింగ్ కు గైర్హజరు కాగా 11 మంది మాత్రమే కార్యాలయానికి వచ్చారు. టీడీపీకి మద్దతు ఇస్తారనుకున్నజనసేన సభ్యుడు తటస్తంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఎక్స్ అఫిషియో సభ్యులు ఎంపి అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే రఘురామిరెడ్డిలతో వైసీపీ బలం 13కి చేరుకుంది. ఓటింగ్‌లో జనసేన అభ్యర్థి టీడీపీకి మద్దతు ఇచ్చి ఉంటే టై అయి డ్రా తీయాల్సిన పరిస్థితి ఏర్పడేది. అయితే జనసేన సభ్యుడు తటస్తంగా ఉండటం, ఒక టీడీపీ సభ్యుడు గైర్హజరు కావడంతో వైసీపీకి చెందిన మాచనూరు చంద్ర చైర్మన్ గా, మహబూబ్ షరీఫ్ వైస్ చైర్మన్ గా ఎన్నికైయ్యారు. దీంతో మైదుకూరు ఉత్కంఠకు తెరపడింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju