NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Viveka Case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం .. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు

YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు అయ్యింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. నేడు తీర్పు కీలక తీర్పు ఇచ్చింది. మే 5వ తేదీ లోపు సీబీఐకి లొంగిపోవాలని ఎర్ర గంగిరెడ్డికి కోర్టు ఆదేశించింది. వివేకా హత్య కేసులో ఘటనా స్థలంలో సాక్ష్యాలను చెరిపివేశారన్న అభియోగంపై ఎర్ర గంగిరెడ్డిని గతంలో పోలీసులు అరెస్టు చేయగా, అప్పటి సిట్ 90 రోజుల్లో చార్జిషీటు దాఖలు చేయని కారణంగా కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదల అయ్యారు.

Yerra Gangi Reddy Bail Cancelled by TS High Court

 

ఈ కేసును దర్యాప్తు స్వీకరించిన తర్వాత ప్రధాన నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఏపి హైకోర్టును సీబీఐ ఆశ్రయించింది. అయితే ఏపి హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్ని సీబీఐ పిటిషన్ ను డిస్మిస్ చేసింది ఆ తర్వాత సీబీఐ .. ఏపి హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయగా, ఏపి హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఆ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు బెయిల్ రద్దు పిటిషన్ విచారణను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి బయట ఉండటం వల్ల దర్యాప్తు సహకరించడానికి ప్రజలు ఎవరూ ముందుకు రావడం లేదని సీబీఐ బుధవారం హైకోర్టుకు నివేదించింది. ఆయన వెనుక రాజకీయ ప్రముఖులు ఉండటంతో ప్రజల్లో భయం ఉందని తెలిపింది. నిర్ధిష్ట గడువులోగా చార్జిషీటు దాఖలు చేయకపోవడం వల్ల ఎర్ర గంగిరెడ్డికి మంజూరైన చట్టపరమైన బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం జస్టిస్ చిల్లుకూరు సుమలత విచారణ జరిపారు.

సీబీఐ తరపు న్యాయవాది ఎం నాగేందర్ వాదనలు వినిపిస్తూ .. బెయిల్ సమర్ధిస్తూ ఏపి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు రద్దు చేసిందని తెలిపారు. దాని ఆధారంగా వాదనలు చెప్పడం సరికాదని, ఏ కారణం మీద ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ రద్దు కోరుతున్నారని న్యాయమూర్తి న్యాయమూర్తి ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో పెద్ద కుట్ర దాగి ఉందనీ, పథక రచన, అమలు అంతా ఎర్ర గంగిరెడ్డే చేశారని సీబీఐ తరపు న్యాయవాది చెప్పారు. ఆయన బయట ఉంటే ఇతరులు ఎవరూ దర్యాప్తునకు సహకరించరని తెలియజేస్తూ, ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పును గుర్తు చేశారు.  గుగుల్ టేకౌట్ వంద సాంకేతిక ఆధారాలు ఉన్నాయనీ, గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోరారు. సీబీఐ వాదనలకు ఏకీభవించిన కోర్టు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేస్తూ నేడు తీర్పును వెలవరించింది.

Rain Alert: ఏపిలో మరో వారం రోజులు వర్షాలు .. ఏయే ప్రాంతాల్లో అంటే..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju