NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Young Girl Murder Case: గుంటూరు ఘటనలో బాధిత కుటుంబానికి 24 గంటల్లో చెక్కు అందజేసిన జగన్ సర్కార్..

Young Girl Murder Case: గుంటూరు జిల్లా కాకాణిలో బిటెక్ విద్యార్థిని రమ్య దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై వెంటనే స్పందించిన ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందనీ, రూ.10లక్షలు సాయం అందించాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. సోమవారం గుంటూరు జీజీహెచ్ లో బాధిత కుటుంబాన్ని కలిసిన హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రభుత్వం తరపున రూ.10 లక్షల ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.

Young Girl Murder Case: home minister sucharitha hands over 10 lakh cheque guntur Victim family
Young Girl Murder Case home minister sucharitha hands over 10 lakh cheque guntur Victim family

ఈ సందర్భంగా హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ రమ్యను హత్య చేసిన నిందితుడిని పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్ వెంటనే స్పందించి ఆదేశాలు జారీ చేశారన్నారు. పార్లమెంట్ లో దిశ చట్టం అయితే ప్రత్యేక న్యాయస్థానాలు అందుబాటులోకి వస్తాయన్నారు. సీసీ కెమెరా పుటేజ్ ఆధారంగానే నిన్నటి ఘటనలో నిందితుడిని అరెస్టు చేశామన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు మహిళలు, బాలికలు దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఈ ఘటనను పురస్కరించుకుని టీడీపీతో సహా వివిధ రాజకీయ పక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఘటన జరిగి 24 గంటల్లోపే బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుండి సాయం అందించడం విశేషం. గతంలో ఈ మాదిరిగా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుండి సాయం అందించడం అరుదు.

Young Girl Murder Case: జీజీహెచ్ వద్ద విపక్షాల ఆందోళన

మరో పక్క గుంటూరు జీజీహెచ్ వద్ద వివిధ రాజకీయ పక్షాల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఆసుపత్రిలో రమ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అవ్వడంతో ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఇంటికి తరలించే ప్రయత్నం చేయగా అంబులెన్స్ ను జీజీహెచ్ నుండి కదలకుండా విపక్షాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు అడ్డుకున్నారు. రమ్యను చంపిన యువకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జీజీహెచ్ వద్ద వామపక్షాలు సహా వివిధ పార్టీల నేతలు భైటాయించి నిరసనకు దిగారు. విపక్షాల ఆందోళన నేపథ్యంలో మరో మార్గం ద్వారా తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అక్కడా ఉద్రిక్తత నెలకొన్నది. పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju