NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Avinash Reddy: హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ వేసి మళ్లీ వెనక్కు..ఎందుకంటే..?

YS Avinash Reddy: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇవేళ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సాయంత్రానికి ఆ పిటిషన్ ను ఆయన ఉపసంహరించుకున్నారు. కాగా గతంలో ఇదే కేసులో తనపై కఠిన చర్యలు తీసుకోకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేయగా, పిటిషన్ ను విచారించిన హైకోర్టు .. అరెస్టు చేయవద్దని చెప్పలేమని స్పష్టం చేసింది. అయితే సీబీఐ విచారణ సందర్భంలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని కోర్టు ఆదేశించింది. న్యాయవాది సమక్షంలో విచారణకు కోర్టు నిరాకరిస్తూ విచారణ రూమ్ వరకూ న్యాయవాది వెళ్లవచ్చని చెప్పింది.

YS Avinash Reddy

 

అమరావతి కేసులో ఏపి సర్కార్ కు లభించని ఊరట ..

కాగా ఇప్పటి వరకూ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు నాలుగు సార్లు విచారణ జరిపారు. అయితే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసి మరల వెంటనే ఎందుకు ఉపసంహరించుకున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరో పక్క సుప్రీం కోర్టులో వివేకా కేసు పై విచారణ జరుగుతున్నందున సుప్రీం ఆదేశాల తర్వాత ముందస్తు బెయిల్ పిటిషన్ పై నిర్ణయం తీసుకోవచ్చని భావించి ఉపసంహరించుకున్నారని భావిస్తున్నారు. ఇప్పటికే సుప్రీం కోర్టు వివేకా హత్య కేసు దర్యాప్తునకు మరో అదికారిని నియమించాలని సీబీఐకి ఆదేశించింది. ప్రసుతం ఉన్న రామ్ సింగ్ ను కొనసాగిస్తూనే మరో అధికారిని నియమించాలని, కేసు త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణలో సుప్రీం కోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై ధరఖాస్తు చేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

దేశ వ్యాప్తంగా ఫార్మా కంపెనీలపై డీసీజీఐ దాడులు .. 18 కంపెనీల లైసెన్సులు రద్దు

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: భారీ ఎన్‌కౌంటర్ .. నలుగురు మావో అగ్రనేతల హతం

sharma somaraju

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!