NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కరరెడ్డికి 14 రోజులు రిమాండ్ .. చంచల్‌గూడ జైలుకు తరలింపు .. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ఇవీ..

ys bhaskar reddy remand report contains key points

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు అరెస్టు చేసిన ఆయన సోదరుడు వైఎస్ భాస్కరరెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను అధికారుల చంచల్ గూడ జైలుకు తరలించారు. తమకు పది రోజుల కస్టడీ విచారణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఇంకా ఈ హత్య కేసులో విచారించాల్సిన ఉందని, అందుకు భాస్కరరెడ్డిని తమ కస్టడీకి పది రోజుల పాటు అప్పగించాలని సీబీఐ తమ పిటిషన్ లో కోరింది.

ys bhaskar reddy remand report contains key points
ys bhaskar reddy remand report contains key points

 

అంతకు ముందు వైఎస్ భాస్కరరెడ్డిని పులివెందుల నుండి హైదరాబాద్ కు తీసుకువచ్చిన సీబీఐ అధికారులు ముందుగా ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. భాస్కరరెడ్డి కి బీపీ లెవల్స్ పెరగడంతో కొద్ది సేపు వైద్యులు అబ్జర్వేషన్ లో ఉంచారు. మందులు వాడాలని సూచించారు. కొద్దిసేపు అబ్జర్వేషన్ లో ఉంచిన వైద్యులు ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలియజేయడంతో సీబీఐ అధికారులు ఆయనను తరలించి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. భాస్కరరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. న్యాయమూర్తి ఆదేశాలతో ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. భాస్కరరెడ్డి రిమాండ్ రిపోర్టులో సీబీఐ కీలక అంశాలను ప్రస్తావించింది. పది పేజీల రిమాండ్ రిపోర్టును సీబీఐ కోర్టుకు సమర్పించింది.

వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కరరెడ్డి పాత్ర కీలకమని సీబీఐ అభియోగం మోపింది. హత్యకు ముందు, తర్వాత నిందితులు భాస్కరరెడ్డి ఇంట్లో ఉన్నారనీ, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డి కలిసి పథకం ప్రకారమే వివేకాను హత్య చేయించారని రిమాండ్ రిపోర్టులో సీబీఐ ప్రస్తావించింది. సాక్షాలు తారుమారు చేయడంలో కీలక పాత్ర పోషించారని తెలిపింది. విచారణకు భాస్కరరెడ్డి సహకరించడం లేదనీ, ఆయన పారిపోయే అవకాశం ఉందని అరెస్టు చేశామని పేర్కొంది. కీలక సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందనే అరెస్టు చేశామని సీబీఐ తెలిపింది.

భాస్కరరెడ్డి అరెస్టు నేపథ్యంలో పులివెందుల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. వైసీపీ నేతల పెద్ద సంఖ్యలో నల్లబ్యాడ్జీలు ధరించి శాంతి యుత నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. వ్యాపార వాణిజ్య సంస్థలను స్వచ్చందంగా మూసి వేసి నిరసన కార్యక్రమానికి మద్దతు తెలియజేశారు. సీబీఐ ఏకపక్షంగా విచారణ జరిపి అన్యాయంగా భాస్కరరెడ్డిని అరెస్టు చేశారని అవినాష్ రెడ్డి అనుచరులు పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఏపి మాజీ ఎమ్మెల్యే దుర్మరణం

author avatar
sharma somaraju Content Editor

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju