NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ టెక్నాలజీ ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు హెల్త్

YS Jagan: కేసీఆర్‌, జ‌గ‌న్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న స‌మస్య ఇదే

Share

YS Jagan: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ను , ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఒకే ర‌క‌మైన స‌మ‌స్య ఉక్కిరిబిక్కిరి చేస్తోందా? ఏక‌కాలంలో ఈ ఇద్ద‌రు సీఎంలు ఓ ప‌రిష్కారం కోసం అడుగు వేసే ప‌రిష్కారం వైపు కాకుండా పీఠ‌ముడి వైపే ప‌రిణామాలు మారిపోతున్నాయా? అంటే అవుననే స‌మాధానం వ‌స్తోంది. ఇదంతా క‌రోనా క‌ల‌క‌లం, ఈ స‌మ‌యంలో వ్యాక్సిన్ల అందుబాటు గురించి! టీకాల కొనుగోలుకు వెళ్లిన గ్లోబ‌ల్ టెండ‌ర్లు వైఫ‌ల్యం అవ‌డం గురించి!!

Read More: Corona: డ‌బ్బులు ప్రింట్ చేసుకుంటే స‌మ‌స్యే ఉండ‌దు… క‌రోనా స‌మ‌యంలో భ‌లే విశ్లేష‌ణ‌

అప్పుడేమో అలా…

క‌రోనా వైర‌స్ విస్తృతికి బ్రేక్ వేసేందుకు టీకాలు వేసుకోవ‌డమే మార్గ‌మ‌ని ప్ర‌చారం చేసిన కేంద్రం వాటి స‌ర‌ఫ‌రాలో వైఫ‌ల్యం చెందింద‌నే ఆరోప‌ణ‌లున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వాలే గ్లోబ‌ల్ టెండ‌ర్ల‌ను ఆహ్వానించాయి. మిగ‌తా రాష్ట్రాల వ‌లే తెలుగు రాష్ట్రాలు సైతం ఈ టెండ‌ర్ల‌కు మొగ్గు చూపాల‌రు. అయితే, కరోనా టీకాల కొనుగోలు కోసం ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం , అటు ఏపీ స‌ర్కారు పిలిచిన గ్లోబల్ టెండర్లకు ఆదరణ కరువైంది. దీంతో త్వ‌రిత‌గ‌తిన‌ వ్యాక్సిన్లు వేయాల‌నే ప్ర‌క్రియ‌లో నిరాశే ఎదురైంది. తెలంగాణ ప్ర‌భుత్వం మొత్తం కోటి డోసుల కొనుగోలుకు గత నెల 19న ప్రభుత్వం టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే. అయితే, గ్లోబ‌ల్ టెండ‌ర్ల‌లో ఒక్క సంస్థ కూడా టెండర్‌‌లో పాల్గొనలేదు. గత నెల 26న నిర్వహించిన ప్రీ-బిడ్‌ మీటింగ్‌లో పాల్గొన్న స్పుత్నిక్ వీ, ఆస్ట్రాజెనెకా కంపెనీలు కూడా చివరకు టెండర్‌ వేయలేదు. ఏపీలోనూ ఇదే ప‌రిస్థితి. దీంతో ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ , అటు ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ నిరాశ చెంద‌క త‌ప్ప‌లేదు.

Read More: Corona: క‌రోనా టైంలో ఒక్కొక్క‌రుగా మోడీని భ‌లే బుక్ చేస్తున్నారుగా

ఏం చేయ‌లేని ప‌రిస్థితి…

కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లకు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో టెండర్లలో పాల్గొని, ప్రభుత్వాలు పెట్టే నిబంధనలకు లోబడి వ్యాక్సిన్ల పంపిణీకి కంపెనీలు సిద్ధంగా లేవు. తాము పెట్టే ష‌ర‌తుల‌కు ఒప్పుకుంటేనే వ్యాక్సిన్లు సప్లై చేస్తామని ఇప్పటికే పలు కంపెనీలు ప్రకటించాయి. రాష్ట్ర సర్కార్లతో కాకుండా కేంద్ర సర్కార్‌‌‌‌‌‌‌‌తో మాత్రమే డీల్ చేస్తామని స్పష్టం చేస్తాయి. ప్రస్తుతం డబ్ల్యూహెచ్ ఓ, డీసీజీఐ, ఎఫ్‌‌‌‌డీఐ పర్మిషన్ ఉన్న వ్యాక్సిన్లు ఏడు ఉన్నాయి. ఇందులో భారత్ బయోటెక్ కొవాగ్జిన్, కొవిషీల్డ్‌‌‌‌(ఆస్ట్రాజెనెకా), స్పుత్నిక్‌‌‌‌ వీ వ్యాక్సిన్లు మన దేశంలో అందుబాటులోకి వచ్చాయి. కొవాగ్జిన్, కొవిషీల్డ్ ఉత్పత్తిలో ఆయా కంపెనీలు సగం కేంద్రానికి ఇచ్చి, ఇంకో సగం తమకు నచ్చినోళ్లకు అమ్ముకుంటున్నాయి. రష్యాకు చెందిన స్పుత్నిక్‌‌‌‌ వీతో హైదరాబాద్‌‌‌‌లోని రెడ్డీస్ ల్యాబ్ ఒప్పందం చేసుకుంది. మన దేశంలో వ్యాక్సిన్లకు ఉన్న డిమాండ్‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని ఆ సంస్థ కూడా టెండర్లలో పాల్గొనడం లేదు. ఫైజర్‌‌‌‌‌‌‌‌, మోడెర్నా, జాన్సన్‌‌‌‌ అండ్ జాన్సన్‌‌‌‌ వంటి అమెరికన్ కంపెనీలు కేంద్రంతో మాత్రమే డీల్ చేస్తామని ప్రకటించాయి.


Share

Related posts

Uttar Pradesh: యూపీలో జరుగుతున్నపెళ్లి వేడుకలలో వింత సంఘటనలు..!!

sekhar

బిగ్ బాస్ 4: మూడో వాడిని ఆర్పేయడనికి మోనాల్ రెడీ అవుతుందా..??

sekhar

Bigg boss 4: గంగవ్వను నామినేట్ చేశారు.. ఈవారం ఇంటి నుంచి బయటకి వెళ్లేందుకు నామినేట్ అయిన కంటెస్టెంట్లు వీళ్లే..!

Varun G