YS Jagan: జగన్‌తో అదే సమస్య..!? కొత్త డిమాండ్‌తో షాక్ ఇచ్చిన ఉద్యోగులు..!

Share

YS Jagan: ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం ఎత్తుతున్నాయి. ఏ ప్రభుత్వానికైనా ఉద్యోగులు తిరుగుబాటు చేస్తే కాస్త ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వ కార్యకలాపాలు, పథకాలు ఉద్యోగుల ద్వారానే ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. వాళ్లే ప్రభుత్వానికి తిరుగుబాటు చేస్తే, వ్యతిరేకంగా గళం విప్పితే ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడిలో ఉంటుంది. ఆ సమస్యను ఎంత త్వరగా పరిష్కరించుకుంటే అంత మంచిది. ఏ ముఖ్యమంత్రి కూడా ఉద్యోగులతో పేచీ పెట్టుకోవడానికి సాహసించరు. ప్రజాబలం ఉన్నప్పటికీ ఉద్యోగులతో పేచీ పెట్టుకుంటే ఆ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని గత అనుభవాలు చెబుతున్నాయి. 1985లో రెండవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎన్టీఆర్..1986లో ఉద్యోగులతో పేచీకి వెళ్లారు. ఉద్యోగులు అప్పట్లో పీఆర్సీ, ఇంక్రిమెంట్ల కోసం గొడవ చేస్తే “మీరు ఏమైనా చేసుకోండి పీఆర్సీ ఇచ్చేది లేదు, మీరు అడిగినవన్నీ ఇస్తే బడ్జెట్ లో 40 శాతం ఇవ్వాల్సి వస్తుంది” అని పేర్కొన్నారు ఎన్టీఆర్. దాంతో అప్పట్లో ఉద్యోగులు 19 రోజుల పాటు సమ్మె చేశారు. సమ్మె ప్రారంభమైన రెండు రోజుల వరకూ ఎన్టీఆర్.. ఉద్యోగులకు వ్యతిరేకంగానే ఉన్నారు. ఉద్యోగుల డిమాండ్లలకు తలొగ్గేదిలేదనీ భీష్మించుకుని కూచ్చున్నారు. చివరకు 19 రోజుల తరువాత ఎన్టీఆర్ స్వయంగా ఉద్యోగ సంఘాల వద్దకు వెళ్లి వాళ్లు అడిగిన డిమాండ్లు అన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చి సమ్మె విరమింపజేశారు.

YS Jagan ap govt employees issue
YS Jagan ap govt employees issue

YS Jagan: నాడు ఉద్యోగుల డిమాండ్‌లకు తలొగ్గిన ఎన్టీఆర్

1985 లో ఎన్టీఆర్ మంచి ప్రజాబలంతో గెలిచారు. ప్రజల్లో మంచి చరిష్మా ఉంది. మంచి పట్టు ఉన్న నాయకుడు. అయినే ఉద్యోగులకు తలొగ్గి అడిగినవన్నీ ఇచ్చారు. ఆ తరువాత చంద్రబాబు కూడా ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఉద్యోగులు అడిగినవన్నీ ఇస్తూనే వచ్చారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ఉద్యోగులు అడిగిన డిమాండ్లు నెరవేర్చడం లేదు. పీఆర్సీ ఇవ్వడం లేదు. సీపీఎస్ రద్దు చేసేది లేదని చెతులు ఎత్తేశారు. ఉద్యోగులు మొత్తం 71 డిమాండ్లు ప్రభుత్వం దృష్టిలో పెట్టారు. ఈ డిమాండ్ల పై చర్చించేందుకు సంఘాల నేతలకు సీఎం జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ వద్ద ఉద్యోగ సంఘాల నేతలు ఇదే ప్రస్తావించారు. సీఎం వద్దకు తమను ఎందుకు తీసుకువెళ్లడం లేదు. సీఎం అపాయింట్మెంట్ ఎందుకు ఇప్పించడం లేదు. ఆయనను కలిసే అర్హత ఉద్యోగ సంఘాల నేతలుగా తమకు లేదా అని ప్రశ్నించారు. అన్ని వర్గాలు ఓట్లు వేస్తేనే జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్ జగన్మోహనరెడ్డికి 156 లక్షల ఓట్లు వచ్చాయి. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. చిన్నా పెద్దా అందరూ జగన్మోహనరెడ్డికి మద్దతు పలికారు. ఉద్యోగుల్లోనూ దాదాపు 75శాతం వైసీపీకే ఓటు వేశారు.

సీఎం అపాయింట్మెంట్ కోసం పట్టుపడుతున్న ఉద్యోగ సంఘాలు

ఇప్పుడు జగన్మోహనరెడ్డి ప్రజల్లో ఎందుకు మమేకం కావడం లేదు. ప్రజల్లో ఎందుకు తిరగడం లేదు. వారంలో ఒక రోజు అయినా ప్రజల్లోకి వెళ్లవచ్చు కదా.. కానీ వెళ్లరు. పైగా ఆయన బయటకు వస్తే రోడ్లు అన్నీ మూసేసి, బారికేడ్ల వేసి ప్రజలకు స్వేచ్చలేకుండా చేస్తున్నారు. ప్రజలకు కలవకపోయినా ఫరవాలేదు. ఉద్యోగులకు ఎందుకు అపాయిట్మెంట్ ఇవ్వడం లేదు. నెలాపదిహేను రోజుల నుండి ఉద్యోగులు రకరకాల డిమాండ్లతో పోరాడుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు ఒక పక్క సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్ శర్మను కలుస్తున్నారు. వీళ్లేమో సీఎం జగన్ తో మాట్లాడతాం, చెబుతాం అంటారు తప్ప నిర్ణయాలను చెప్పే అధికారం లేదు. సీఎం అరగంటో, పావుగంటో సమయం ఇచ్చి నేరుగా ఉద్యోగ సంఘాలతో “రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదు. మీరు చూస్తున్నారు కదా, ఆరు నెలలో, సంవత్సరమో టైమ్ ఇవ్వండి” అన్నీ నెరవేరుస్తా అని ఒక్క హామీ ఇస్తే ఉద్యోగ సంఘాల నేతల ఆయన మాటకు గౌరవిస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోగా, సీఎం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో ఉద్యోగ సంఘాల్లో ఒకరమైన భాధ ఉంది. ఆ బాధ ఇప్పుడు డిమాండ్ గా మారింది. వాళ్లకు ఉన్న అనేక డిమాండ్లతో పాటు సీఎం అపాయింట్మెంట్ ఇప్పించాలన్న డిమాండ్ ఒకటి తోడైంది. జగన్మోహనరెడ్డి వ్యవహార శైలి, తీరే ఉద్యోగులను బాగా ఇబ్బంది పెడుతోంది, బాధపెడుతోందని అంటున్నారు.

 


Share

Related posts

Not Wearing Mask: మాస్కు పెట్టుకోలేదని గన్ తో కాల్చేశాడు..!!

bharani jella

విజయవాడలో 144 సెక్షన్ అమలు

Mahesh

Roja: రోజా స్టార్ హీరోయిన్ అవ్వడం వెనుక ఉన్న ఆ స్టార్ ఎవ్వరో తెలుసా?

Naina