NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan : ఆ లాజిక్ మిస్ అయిన జగన్ : జగన్ కొంప ముంచబోతున్న ఏకగ్రీవాలు ?

YS Jagan: జగన్ తీసుకున్న ఈ నిర్ణయం తో స్థానిక సంస్థల్లో భారీగా విజయం సాధించబోతున్నాడు ?

YS Jagan : నిన్న మున్నటి వరకూ ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరగవని వైసీపీ భావించింది. ప్రభుత్వం సహకరించకపోతే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు పెట్టలేరు. ఏదో రూపంలో కోర్టుకు వెళ్లి నిలుపుదల చేయవచ్చు అని వైసీపీ అనుకున్నది. చివరకు సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికలకు ప్రభుత్వం, వైసీపీ ఒప్పుకోవాల్సి వచ్చింది. ఎన్నికలు అనివార్యం అని తేలిపోవడంతో వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ మంత్రులు ఏకగ్రీవాల పల్లవి ఎత్తుకున్నారు. గ్రామాల్లో ప్రజలు అందరూ ఒక తాటికి పైకి వచ్చి ఎన్నికలకు పోకుండా ఏకగ్రీవాలు చేసుకోండి అంటూ పిలుపు నిచ్చారు. ప్రభుత్వం కూడా ఏకగ్రీవ పంచాయతీలకు నగదు ప్రోత్సాహకాలను పెంచుతూ జీవో విడుదల చేసింది. పత్రికా ప్రకటన కూడా ఇచ్చింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల తరుణంలో తనకు సమాచారం ఇవ్వకుండా ఎన్నికల ప్రకటనకు పత్రికలకు ఎలా ఇచ్చారంటూ సమాచార శాఖ కు వివరణ కోరింది.

YS Jagan : ap local body elections
YS Jagan ap local body elections

YS Jagan : ఏకగ్రీవాల పల్లవి ఎందుకు?

ఇదిలా ఉంటే అధికార వైసీపీ ఇప్పుడు ఏకగ్రీవాలకు ఎందుకు పట్టుబడుతుంది అన్నది అర్థం కావడం లేదు. ప్రభుత్వ ప్రకటన చూసిన ఎకగ్రీవాలు పంచాయితీలకేనా అసెంబ్లీ ఎన్నికలు కూడా ఏకగ్రీవం చేసుకుంటారా అని ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నెటిజన్ లు. ఎన్నికలకు భయపడటం లేదు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా అత్యధిక స్థానాలు కైవశం చేసుకుంటాం అని ధీమా వ్యక్తం చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ఎందుకు వెనుకడుగువేసి ఏకగ్రీవాల జపం చేస్తున్నారని ప్రజలు వస్తున్నాయి. ప్రభుత్వం తమ ఓటమిని పరోక్షంగా ఒప్పుకుంటోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. బలవంతపు ఏకగ్రీవాలు చేయాలని అధికార పక్షం చూస్తుందంటూ టీడీపీ, బీజెపీ, జనసేన తదితర పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ తరుణంలోనే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకగ్రీవాలపైనా దృష్టి పెడతామని ప్రకటించారు.

YS Jagan : పోటీ చేసి గెలిస్తే ఆ మజానే వేరు

 

దీనిపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సహా పలువురు వైసీపీ నేతలు ఎన్నికల కమిషనర్ తీరును తప్పుబట్టారు. ఏకగ్రీవాలకు నజరానాలు ఇవ్వడం ఎప్పటి నుండో ఉందని, కొత్తగా ఇప్పుడు ఏకగ్రీవాలు కుదరదు అనడం ఏమిటని ప్రశ్నించారు. అయితే దీనిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ వివరణ ఇచ్చారు. ఎకగ్రీవాలను ప్రోత్సహిస్తాము కానీ మరీ ఎక్కువ ఎకగ్రీవాలు అయితే వాటిపై ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు. ప్రలోభాలు, బెదిరింపులతో ఏకగ్రీవాలతో ఏకగ్రీవాలు జరగకుండా చూస్తామన్నారు. ఎన్నికలను నేరుగా ఎదుర్కునే దమ్ము లేకనే ఎకగ్రీవాలు, ప్రోత్సాహకాలు అంటూ ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తున్నదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే పోటీ చేస్తే గెలుపొందే ప్రాంతాల్లోనూ ఏకగ్రీవాలు చేయాలని నేతలు పట్టుబట్టడం ఆ పార్టీ నేతలకే రుచించడం లేదుట. షంషేర్ గా గెలిచే అవకాశం ఉన్నప్పుడు ప్రత్యర్థులను బుజ్జగించడం, బతిమాలుకోవడం దేనికని ప్రశ్నిస్తున్నారు. పోటీ చేసి గెలిస్తే ఉండే మజానే వేరు. అప్ప అంటున్నారు కొందరు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju