NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan : వాలంటీర్ల విషయంలో జగన్ కు సీపీఐ రామకృష్ణ స్ట్రాంగ్ కౌంటర్ .. జగన్ ఏమి సమాధానం చెబుతారో? 

YS Jagan : ఏపిలో రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల గ్రామ, వార్డు వాలంటీర్లు తమకు వేతనాలు పెంపు చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంటింటి రేషన్ పథకం వాహన ఆపరేటర్ లు బాధ్యతలు చేపట్టిన పది రోజుల్లోనే ఆందోళన చేస్తే రూ.16 వేల నుండి రూ.21 వేలు చేసిన ప్రభుత్వం.. ఏడాదిన్నర నుండి గొడ్డు చాకిరీ చేస్తున్న తమకు మాత్రం కేవలం రూ.5వేలు మాత్రమే ఇస్తున్నారనీ, తమకు వేతనాలు రూ.12వేలకు పెంచాలంటూ వాలంటీర్లు డిమాండ్ చేశారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వాలంటీర్ల మరో మాట మాట్లాడే అవకాశం లేకుండా ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. వాలంటీర్ లు జీతానికి పని చేసే ఉద్యోగులు కాదు, స్వచ్చందగా ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చిన వారు, వారికి ఇస్తున్నది జీతం కాదు, గౌరవ భృతి అంటూ చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు తాను చెప్పాననీ, వాలంటీర్ ల హాండ్ బుక్ లోనూ ఇది ఉంటుందని స్పష్టం చేశారు. వేరే మంచి ఉద్యోగం వచ్చే వరకూ వారు వాలంటీర్ గా సేవలు అందించవచ్చని తెలిపామన్నారు. ప్రతి రోజు కార్యాలయానికి వాలంటీర్లు వెళ్లాల్సిన అవసరం లేదని కూడా తెలిపారు.

YS Jagan : cpi rama krishna comments on voluntaries issue
YS Jagan cpi rama krishna comments on voluntaries issue

అయితే ఇంతకు ముందు వాలంటీర్ లు ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా  గ్రామ సచివాలయాలకు, మున్సిపల్ కార్యాలయాలకు వెళ్లి ఉదయం నుండి సాయంత్రం వరకూ ఏదో పని చేసే వారు. ఇప్పటి వరకూ ఉద్యోగులుగా బాధ్యతలు నిర్వహించిన వాలంటీర్లు సీఎం లేఖ తరువాత ఇంతకు ముందు మాదిరిగా కార్యాలయాలకు వెళ్లడం లేదని తెలిసింది. పెన్షన్లు పంపిణీ చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజెప్పడం వరకే తమ పని, రోజు కార్యాలయానికి రావాల్సిన పని లేదు అని వాలంటీర్ లు కరాఖండిగా చెబుతున్నట్లు సమాచారం.

YS Jagan : జీతాలు పెంచమంటే సేవకులుగా మారుస్తారా?

వాలంటీర్లు సేవలకులు అంటూ సీఎం జగన్ లేఖ రాయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తప్పుబట్టారు. జీతాలు పెంచమని అడిగితే వాలంటీర్లను ఉద్యోగుల నుండి సేవకులుగా మారుస్తారా అని ప్రశ్నించారు. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో వాలంటీర్లను నియమించి.. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారని గుర్తు చేశారు. మాట తప్పం – మడమ తిప్పం అన్న సీఎం జగన్ ఇప్పుడు వాలంటీర్లను సేవకులుగా గుర్తిస్తూ లేఖ రాయడాన్ని ఏమనాలి అన్నారు. ఎమ్మెల్యేలు కూడా ప్రజా సేవకులే కదా వారికి నెలకు లక్షలాది రూపాయలు చెల్లించడం ఎందుకని రామకృష్ణ ప్రశ్నించారు. రాష్ట్రంలో నియమించబడిన రెండున్నర లక్షల మంది వాలంటీర్లను ప్రభుత్వం దగా చేస్తోందని విమర్శించారు. జగన్ కు చిత్తశుద్ధి ఉంటే వాలంటీర్లకు వేతనం రూ.12వేలు ఇవ్వాలని, ఈఎస్ఐ, పిఎఫ్ అమలు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?